హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ.. వైద్య సిబ్బందిపై వేటు
మొబైల్ టెక్నాలజీ, సోషల్ మీడియా కామన్ మ్యాన్‌కు అందుబాటులోకి రావడంతో స్పాట్‌లో ఫొటోలు, సెల్ఫీ తీసుకోవడం చాలా తేలికైంది. ఎదైనా ఘటన జరిగితే వెంటేనే ఫొటో కొట్టేయడం, వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రతీ ఒక్కరికి అలవాటుగా మారింది. ఈ అలవాటు కామినేని హాస్పిటల్ వైద్య సిబ్బందికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకొన్నది. వివరాల్లోకి వెళితే...
ఆగస్టు 30 తేది ఉదయం సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ నల్లగొండలోని అన్నెపర్తి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని నార్కట్ పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ హరికృష్ణకు ఇద్దరు డ్యూటీ డాకర్లు, ఓ వార్డుబాయ్, మహిళ చికిత్స అందించారు.

చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో బెడ్ భౌతికకాయం ఉండగా వారు నవ్వుతూ సెల్ఫీ దిగారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. విషాదం సమయంలో ఆ చేష్టలేంటి? ఆ నవ్వులు దేనికి అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినోదం, విషాదం అనే విషయాలకు తేడా లేకుండా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దాంతో యాజమాన్యం వారిపై వేటు వేసింది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రకటన జారీ చేసింది.


Click it and Unblock the Notifications











