మీ కోసం ఇంటి వద్ద ఎదురుచూపులు.. ఆ విషాదం మరవక ముందే.. షాకింగ్‌లో ఎన్టీఆర్, కల్యాణ్ రాం
Recommended Video

తండ్రి హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదవార్త తెలియగానే ఎన్టీఆర్, కల్యాణ్ రాం వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. హాస్పిటల్‌లో తండ్రి పార్థీవదేహాన్ని చూసి భోరున విలపించారు. పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకొంటూ తండ్రి భౌతికకాయాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లలో మునిగిపోయారు.

జానకిరాం మృతితో
తన సోదరుడు జానకీరాం మృతితో ఎన్టీఆర్, కల్యాణ్ రాం తీవ్ర విషాదానికి గురయ్యారు. అన్నయ్య లేని లోటు తీర్చలేనిదని పలుమార్లు ఆవేదన గురయ్యారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్, కల్యాణ్‌రాం సూచించేవారు.

వాహనం నడిపేటప్పుడు
జానకిరాం మృతి తర్వాత విడుదలైన నాన్నకు ప్రేమతో చిత్రంలో వాహనం నడిపేటప్పుడు ఇంటి వద్ద మనకోసం ఎదురుచూసే వాళ్లు ఉంటారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వాహనదారులకు రిక్వెస్ట్ చేశారు.

ఎన్టీఆర్ ఇంట్లో మరోసారి విషాదం
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎన్టీఆర్ కుటుంబానికి మరోసారి విషాద ఘటన ఎదురైంది. హరికృష్ణ మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి ఎన్టీఆర్, కల్యాణ్ రాం తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు.

ధైర్యంగా ఉండాలని సూచన
హరికృష్ణ మృతి నేపథ్యంలో ఎన్టీఆర్, కల్యాణ్ రాంకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











