నేను వెళ్తున్నా.. జాగ్రత్తగా చూసుకో.. కంటతడి పెట్టిస్తున్న హరికృష్ణ మాటలు!
Recommended Video

సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. గత 17 ఏళ్ల నుంచి ఆహ్వానం హోటల్‌లో సేవలందిస్తున్న రమణయ్య.. హరికృష్ణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సార్‌కు ప్రతీది నేనే చూసుకొనే వాడిని అని చెప్పారు. సిబ్బందితో హరికృష్ణ చెప్పిన విషయాలు ఉద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి. అవేమిటంటే..

సారుక అన్నీ నేనే చూసుకొనేవాడిని
హరికృష్ణ సారుకు భోజనంలో ఏమి కావాలో అన్నీ దగ్గరుండి చూసుకొనే వాడిని. టీ, టిఫిన్లు, భోజనం, అలా ఏం కావాలన్నా నాతో చెప్పేవారు. హోటల్‌కు వస్తే ముందుగా నా పేరు పెట్టి పిలిచేవారు అని రమణయ్య గుర్తు చేసుకొన్నారు.

నాన్ వెజ్ అంటే ఇష్టం
హరికృష్ణ సారుకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కేఎఫ్‌సీ, పాపాజీ డాబా, అబిడ్స్‌లోని ఇతర హోటల్స్ నుంచి తనకు ఇష్టమైన భోజనాన్ని తెప్పించుకొనే వారు. ఆయనకు తందూరి చికెన్ అంటే చాలా ఇష్టం అని రమణయ్య తెలిపారు.

ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం
ఆహ్వానం హోటల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నేను వెళ్తున్నా. జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవారు. అలాంటి వ్యక్తి లేరంటే నమ్మలేకపోతున్నాను. సార్ లేకపోవడం నా దురదృష్టం అని రమణయ్య ఆవేదనకు గురయ్యారు.

హోటల్ సిబ్బందితో అనుబంధం
బుధవారం ఉదయం నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. మరణానికి ముందు మంగళవారం రాత్రి అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్ నుంచి ఇంటికి వెళ్లిన విషయాన్ని ఈ సందర్బంగా హోటల్ సిబ్బంది చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications











