హరికృష్ణ అంతిమ యాత్ర: మహా ప్రస్థానంలో స్మారక చిహ్నం!
బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. మెహదీపట్నంలోని తన నివాసం నుంచి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హరికృష్ణ పాడె మోశారు.
జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో కుటుంబ సభ్యులు, అధికారులు హరికృష్ణ దహన సంస్కారాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సినీరాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రతాఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదిలా ఉండగా మహాప్రస్థానం వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ప్రభుత్వం కుటుంబ సభ్యలతో చర్చించారు. మహా ప్రస్థానంలో హరికృష్ణ దహన సంస్కారాలు జరిగే ప్రాంతం వద్దకు ఇప్పటికే అలీ, రఘుబాబు వంటి సినీ ప్రముఖులు చేరుకున్నారు.
nandamuri harikrishna death nandamuri harikrishna rip nandamuri harikrishna jr ntr news kalyan ram ntr balakrishna chandrababu tollywood janaki ram death nandamuri harikrishna funeral నందమూ


Click it and Unblock the Notifications