తండ్రి, కొడుకులు అక్కడే.. హరికృష్ణ ఫ్యామిలీని వెంటాడిన రోడ్డు ప్రమాదం..
Recommended Video

స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ ఇకలేరు. నెల్లూరులో జరిగే ఓ వివాహానికి హజరయ్యేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గతంలో హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరాం కూడా నల్గోండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా హరికృష్ణ కుటుంబాన్ని ఇలా విధి వెంటాడటం చర్చనీయాంశమైంది.

నందమూరి జానకి రాం
నందమూరి జానకి రాం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ 2014 డిసెంబర్ 6వ తేదీన నల్గొండలోని ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో జానకిరాం మృత్యువాత పడ్డారు.

జానకిరాం మృతితో హరికృష్ణ
తన కుమారుడు జానకిరాం మృతితో హరికృష్ణ కుంగిపోయారు. తచాలా రోజులు ఆ విషాదం నుంచి తేరుకోలేకపోయారు. అలాంటి ఘటనను నుంచి తెరుకొని ఇప్పుడిప్పుడే చురుకుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం నందమూరి కుటుంబానికి, అభిమానులకు తీరని శోకం నింపింది.

తాజాగా నందమూరి హరికృష్ణ కూడా
తాజాగా నందమూరి హరికృష్ణ కూడా నల్గొండలోని జాతీయ రహదారిపై మృతి చెందడం సినీ, రాజకీయ వర్గాలను షాక్ గురి చేసింది. ఆగస్టు 28 తేదీ మంగళవారం రాత్రి మృతి చెందడం సామాన్య ప్రజలను కూడా శోక సంద్రంలో ముంచింది.

ఒకే ఫ్యామిలీలో తండ్రి, కొడుకులు
ఒకే ఫ్యామిలీలో తండ్రి, కొడుకులు ఒకే రహదారిపై మృత్యువాత పడటం చర్చనీయాంశమైంది. దుఖ:సాగరంలో ఉన్న ఎన్టీఆర్, కల్యాణ్ రాంకు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











