నా కొడుక్కి పునర్జన్మ: హరికృష్ణ
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన జూనియర్ ఎన్టీఆర్‌కిది పునర్జన్మ అని శుక్రవారం ఆయన తండ్రి హరికృష్ణ అన్నారు. హైదరాబాద్ లో లేని ఆయన మిగితా కుటుంబ సభ్యుల కంటే ఆలస్యంగా కుమారుడీని పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీర్‌ను పరామర్శించడానికి వచ్చిన హరికృష్ణ, దైవకృప వల్లే జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.


Click it and Unblock the Notifications











