మళ్లీ వచ్చేసాడు...ఈ సారి ఏం తీసాడో? (వీడియో)
హైదరాబాద్ : గతంలో చంద్రహాస్, అలెక్స్ వంటి చిత్రాలు చేసిన హరినాథ్ పొలిచర్ల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం 'బి.ఎఫ్.ఎఫ్'. ఈ చిత్రంలో ఆయన నటించారు. విశ్వరామ్, రెహాన్, ఏంజెలినా, సురభి సూర్యకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తయింది. సోమవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాల్ని ఆవిష్కరించారు. రచయిత, దర్శకుడు శివశక్తి దత్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
హరినాథ్ పొలిచర్ల మాట్లాడుతూ ''బి.ఎఫ్.ఎఫ్... అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అని అర్థం. మంచి స్నేహితుడు ఎప్పుడూ మన సంతోషాన్ని కోరుకుంటాడనే విషయాన్ని ఆసరాగా చేసుకొని చేసిన సినిమా ఇది. ఇందులో ఐదు పాత్రలుంటాయి. గౌతమ్ అనే పాత్రలో నేను నటించా. రాయల్‌రాజ్ సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం'' అన్నారు.

శివశక్తి దత్తా మాట్లాడుతూ ''సినిమాపై ప్రేమ ఉన్న వ్యక్తి హరినాథ్. విదేశాల్లో వైద్యుడిగా పనిచేస్తూనే ఇక్కడ చిత్రాలు చేస్తుంటారు. ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశమిచ్చి చేసిన ఈ సినిమా విజయవంతం కావాలని'' ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications