క్రికెటర్ క్రిస్ గేల్‌తో హరి ప్రియ
'పిల్ల జమిదార్' చిత్రంలో హీరో నాని సరసన హీరోయిన్‌గా నటించిన 'హరిప్రియ' వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌తో కలిసి డాన్స్ చేసింది. హరిప్రియ నటించిన కన్నడ సినిమా 'కిలాడీ కిట్టి' ఆడియో వేడుక సందర్భంగా ఈ దృశ్యం చోటు చేసుకుంది.
ఐపీఎల్ బెంగుళూరు జట్టు ఆటగాడైన క్రిస్ గేల్‌ను.... బెంగుళూరులో ఇటీవల జరిగిన 'కిలాడీ కిట్టి' ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. గేల్‌తో డాన్స్ చేసిన అనంతరం హరిప్రియ మాట్లాడుతూ....ఆయనతో కలిసి డాన్స్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది, అతనో గొప్ప ఆటగాడు, చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది.
తన పెళ్లి విషయం గురించి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రేమించే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రేమించుకోవడం ద్వారా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ఎదుటివారి ఇష్టాలు, అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకునే వీలుంటుంది. ఇలా చేయడం ద్వారా వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందనేది నా నమ్మకం అని అంటోంది.
ఏదైనా జీవితంలో సర్దుకు పోవడంతోనే ముడిపడి ఉంటుంది. అయితే నేను ఇంత వరకు ప్రేమలో పడలేదు. కాలేజీ లైఫ్‌లో ప్రేమించమని చాలా మంది కుర్రాళ్లు వెంటబడ్డారు. ఎవరికీ ఓకే అని చెప్పలేదు. ఎందుకంటే నాది ప్రేమించే వయసుకాదు కాబట్టి. కెరీర్‌లో స్థిరపడిన తరువాతే ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచిస్తా'' అంటోంది ఈ సెక్సీ హీరోయిన్.
తకిట తకిట చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హరిప్రియ ఆ తర్వాత నానితో కలిసి పిల్లజమిందార్ చిత్రంతో హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత అమ్ముడుకి ఏ ఒక్క అవకాశం కూడా దక్కలేదు. ప్రస్తుతం ఈ భామ ఐదు కన్నడ చిత్రాలతో పాటు ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











