వామ్మో ‘హరి ప్రియ’ ఇంత మాసా..?(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: తకిట తకిట, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ హరిప్రియ. ఈ సినిమాలతో హరి ప్రియకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఇట్లా అయితే సినీ పరిశ్రమలో కష్టం అని గ్రహించిందో? ఏమో? గానీ...అందాల డోసు పెంచింది. ఇప్పటికే తమిళంలో రూపొందిన ఓ చిత్రంలో హాట్ హాట్ గా నటించిన హరి ప్రియ...తాజాగా వరుణ్ సందేష్ తో చేస్తున్న 'అబ్బాయి క్లాస్...అమ్మాయి మాస్' అనే చిత్రంలో తన అందాల ప్రదర్శన కంటిన్యూ చేస్తోంది.

క్లాస్ లుక్ తో వరుణ్ సందేష్... మాస్ లుక్ తో హరి ప్రియ

అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్' అనే టైటిల్‌కు చాలా మంచి స్పందన వస్తోందని నిర్మాత తెలిపారు.

గోవాలో పూర్తయిన షెడ్యూల్‌తో నాలుగు పాటలు సహా 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది.

మరి ఇంత హాట్ గా ఫోజులు ఇచ్చిన హరి ప్రియకు ఈ సినిమా ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

వరుణ్ సందేశ్ ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నిటి కంటె విభిన్నంగా ఉండే చిత్రమిది.
లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా 'అబ్బాయి క్లాస్..అమ్మాయి మాస్' చిత్రం రూపొందుతోంది. 'కోనేటి శ్రీను'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మణ్ కేదారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ సందేశ్-హరిప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ డిసెంబర్ 3 నుంచి 10 వరకు హైద్రాబాద్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో ఒక పాటతోపాటు పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తారు.
ఆలీ, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాస్ శ్రీను, శ్రీలక్ష్మి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, సాహిత్యం: భాస్కరభట్ల, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాత: లక్ష్మణ్ క్యాదారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కోనేటి శ్రీను.


Click it and Unblock the Notifications











