డైరెక్టర్ హరీష్ రాజ్ ప్రేమ వివాహం (ఫోటోస్)
హైదరాబాద్: కన్నడ డైరెక్టర్ అండ్ యాక్టర్ హరీష్ రాజ్ ఓ ఇంటి వాడయ్యాడు. శృతి లోకేష్ అనే అమ్మాయిని ఆగస్టు 20న వివాహమాడాడు. బెంగుళూరు కంటోన్మెంట్ ఏరియాలోని జాస్మా భవన్‌లో వీరి వివామం వైభంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు కన్నడ సినీ ప్రముఖులు హాజరయ్యారు.
హరీష్ రాజ్, శృతిలది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ కొంత కాలం డేటింగ్ చేసారు. ప్రేమించుకున్నారు. ఒకరి గురించి మరొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. శృతి లోకేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తోంది.
వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

ఇంటర్ కాస్ట్ మ్యారేజ్
వీరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. శృతి ఫాదర్ కు టమ్కూర్‌లో సొంత కంపెనీ ఉంది. ఇదరు కుటుంబాల అంగీకారంతో ఈ వివాహం జరిగింది.

శృతి ఎం.ఎస్.సి గ్రాజ్యుయేట్
శృతి ఎం.ఎస్.సి గ్రాజ్యుయేట్. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. హరీష్ రాజ్ టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు. పలు చిత్రాల్లో నటించాడు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

ట్రెడిషనల్ వెడ్డింగ్
పూర్తి హిందూ సాంప్రదాయ బద్దంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

టెలివిజన్ ద్వారా హరీస్ కెరీర్
హరీష్ రాజ్ తొలుత యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications