మార్నింగ్ షోకి వెళ్తే సెకండ్ షో టికెట్స్.. నాటి సంగతులపై హరీష్ శంకర్ ట్వీట్
డైరెక్టర్ హరీష్ శంకర్ మెగా ఫ్యామిలీకి అభిమాని అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవికి వీరాభిమాని, పవన్ కళ్యాణ్ భక్తుడడినని చెప్పుకుంటాడు. గబ్బర్ సింగ్ చిత్రం తరువాత హరీష్ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో సాన్నిహిత్యం పెరిగింది. రీసెంట్‌గా వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్ అంటూ సూపర్ హిట్ కొట్టేశాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత.. హరీష్ శంకర్-పవన్ కాంబోనే చూడాలని మెగా అభిమానులు కోరుకున్నారు.
మొత్తానికి ఆ కోరికా తీరబోతోంది. మైత్రీ మూవీస్ నిర్మాణంలో పవన్-హరీష్ మూవీ రాబోతోంది. ఈ విషయాలన్నీ కాసేపు పక్కనబెడితే హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రంగానికి సంబంధించిన అంశాలే కాకుండా సామాజిక సమస్యలపైనా స్పందిస్తుంటాడు. ఎక్కడైనా తప్పు జరుగుతుందని భావిస్తే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్తాడు. అలాంటి దర్శకుడు తాజాగా ఓ సినిమా గురించి ట్వీట్ చేశాడు. ఆ సినిమా చూడటానికి ఎంత కష్టపడ్డాడో వివరించాడు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే కాకుండా.. తెలుగు సినీ పరిశ్రమలో మైలురాయిగా నిలిచిన చిత్రం ఘరానా మొగుడు. మొట్టమొదటి సారిగా పదికోట్లు కొల్లగొట్టిన తెలుగు చిత్రంగా రికార్డులను క్రియేట్ చేసింది. అలాంటి సినిమా కోసం.. మార్నింగ్ షోకు వెళ్తే సెకండ్ షోకు టికెట్స్ దొరికాయని తెలిపాడు. అప్పటికే రిపీట్ ఆడియెన్స్ వచ్చేశారు.. పోర్ట్ ఫైట్, సాంగ్ అయ్యేసరికి బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ కెరీర్‌లో ఓ అద్భుతమైన చిత్రమని.. మాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు గురూజీ అంటూ ట్వీట్ చేశాడు. ఘరానా మొగుడు చిత్రానికి 28 ఏళ్లు నిండిన సందర్భంలోఈ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











