కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.. ఆ దర్శకుడిపై హరీష్ శంకర్ కామెంట్స్
ఈవీవీ సినిమాలో హాస్యంతో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఈవీవీ అనే శకంలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ఈవీవీ ముందు నిలిచారు. చిన్న సినిమాలతో మొదలై స్టార్ హీరోల వరకు అందరితోనూ పని చేశారు. అందరూ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత ఈవీవీది. నేడు ఆయన జయంతి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన సినిమాలను,ఆయన పంచిన హాస్యాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
ఈవీవీ వారసత్వంగా ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్యన్ రాజేష్‌కు మొదట్లో మంచి గుర్తింపే వచ్చినా ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదు. తాజాగా వినయ విధేయ రామతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడదామని అనుకున్నా వర్కౌట్ కాలేదు. ఇక అల్లరి నరేష్ కూడా తన తంటాలు తాను పాడుతున్నాడు. మహర్షి సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చి నాంది అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దమయ్యాడు.

అయితే ఈవీవీ లెగసీని కొనసాగించేందుకు ఎవ్వరూ లేకపోయినా ఆయన చూపిన దారిలో ఎంతో మంది దర్శకులు నడుస్తున్నారు. అందులో ఒకరే హరీష్ శంకర్. ఈవీవీ జయంతి సందర్భంగా హరీష్ స్పందిస్తూ.. 'నాకు ఊహతెలిశాక నేను చూసిన తొలి 'స్టార్ డైరెక్టర్' "EVV సత్యనారాయణ" గారు. చిన్న చిన్న కామెడీ సినిమాల నుండి పెద్ద పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ల వరకు అదే దీక్షతో పనిచేసి ఎందరో రచయితలను, దర్శకులను ఇన్స్పైర్ చేసిన 'కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్' EVV గారికి జన్మదిన శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











