'గబ్బర్‌సింగ్' రికార్డులే సమాధానం: హరీష్ శంకర్
గణేశ్ తీసిన తొలి రెండు చిత్రాలు సరిగా ఆడకపోవడంతో ఆయనను అపహాస్యం చేసినవాళ్లకు 'గబ్బర్‌సింగ్' రికార్డులే సమాధానం అని హరీష్ శంకర్ చెప్పారు. గబ్బర్ సింగ్ రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతున్న నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. గతంలో గణేష్ చేసిన తీన్ మార్,ఆంజనేయులు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. దాంతో అంతా గణేష్ ని ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ అన్నారు. అయితే గబ్బర్ సింగ్ చిత్రం గణేష్ ని ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాతను చేసింది.
అలాగే "పవన్‌కల్యాణ్ లేకపోతే 'గబ్బర్‌సింగ్' లేదు. ఈ సినిమా కొత్త రికార్డులు కొట్టేంత హిట్టు కావడం వెనుక పవన్‌కల్యాణ్ కృషి ఎంతో ఉంది. తన ఆరోగ్యాన్ని పణంగాపెట్టి ఈ సినిమా చేశారు. ఇంత పెద్ద హిట్టొచ్చిందని ఆయన్ను కలిసి కలెక్షన్ల గురించి చెప్పబోతే ఆయన వారించారు. వాటికి ఆయన అతీతుడు. ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్, ఎడిటర్ గౌతంరాజు, ఫైట్‌మాస్టర్లు రామ్-లక్ష్మణ్ పాత్ర కూడా ఉంది అని హరీష్ చెప్పారు.
నిర్మాత బండ్ల గణేష్ బాబు మాట్లాడుతూ...పవన్‌కల్యాణ్ 'గబ్బర్‌సింగ్' రాకతో మునుపటి రికార్డులన్నీ ఎగిరిపోయాయి. మా సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నా మా హీరో అలాంటివేమీ పట్టించుకోకుండా తోటపని చేసుకుంటున్నారు. ఆయన వీటిని పట్టించుకోర ని అన్నారు. త్వరలో ఈ సినిమా విజయోత్సవాన్ని భారీ ఎత్తున చేయబోతున్నాం. ఆ సందర్భంగా ఈ సినిమాని పైరసీ నుంచి కాపాడిన అభిమానులకు సన్మానం చేస్తాం అని చెప్పారు.
హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగు పరిశ్రమలోని పాత రికార్డులను తన కలెక్షన్స్ తో చెరిపేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











