'గబ్బర్ సింగ్' పన్నిన వ్యూహమేంటి?: హరీష్ శంకర్
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'గబ్బర్ సింగ్'. హిందీ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ... జేబుదొంగ, చిల్లర దొంగ, చిలిపి దొంగ, చీరల దొంగ... ఇలాంటి దొంగల్ని పట్టుకోవడమంటే గబ్బర్ సింగ్‌కి నచ్చని వ్యవహారం. పొట్టకూటి కోసం కత్తెరకు పనిచెబుతున్నవాళ్లపై తన ప్రతాపం చూపించడానికి ఇష్టపడడు. అతని దృష్టంతా... పెద్ద చేపలపైనే. అందుకే ఈ చిన్ని దొంగల్ని ఎరగా మార్చుకొన్నాడు. ఇంతకీ ఆ ఘరానా దొంగల కథేమిటి? వారిని పట్టుకోవడానికి గబ్బర్‌సింగ్ పన్నిన వ్యూహమేంటి? ఈ విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు .
శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. వినోదం, యాక్షన్ సమపాళ్లలో మేళవించిన కథ ఇది. పవన్ పాత్ర చిత్రణ.. అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు అదనపు ఆకర్షణ. ఏప్రిల్ మొదటి వారంలో పాటల్ని విడుదల చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











