'గబ్బర్‌ సింగ్‌' ఆఫర్ ఎలా వచ్చిందంటే...: హరీష్ శంకర్

By Srikanya

'గబ్బర్‌ సింగ్‌' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం తనకు ఎలా వచ్చిందో హరీష్ శంకర్ మీడియాకు తెలియచేసారు. హరీష్ మాట్లాడుతూ...''కొద్ది కాలం క్రితం ఒక స్క్రిప్ట్‌తో పవన్‌ కళ్యాణ్‌ను కలిశాను. ఆయనకు నచ్చింది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు రూపుదిద్దుకోలేదు. కానీ 'మిరపకాయ్‌' విడుదలైంది. పవన్‌ కళ్యాణ్‌ నన్ను పిలిచారు. 'గబ్బర్‌ సింగ్‌' పేరుతో 'దబంగ్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయమని అడిగారు. 'దబంగ్‌' ఆయనకు విపరీతంగా నచ్చేసింది. తెలుగులో రీమేక్‌ చేస్తావా అని నన్ను అడిగారు'' అని వివరించాడు.

అలాగే ఆ క్షణం కోసమే నేను వేచి చూస్తున్నాను. ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్టులన్నింటిని బద్దలు కొడుతుందని నాకు అనిపించింది. నాపై పెద్ద బాధ్యత ఉందని నాకు తెలుసు'' అని ఎమోషనల్ గా వివరించారు. అలాగే గబ్బర్‌సింగ్‌ విజయం నా సినీ కెరీర్‌లో మైలురాయి. పవన్‌ కళ్యాణ్‌తో పని చేసి అనూహ్య విజయాన్ని సాధించడం నాకు మిక్కిలి ఆనందంగా ఉంది. ఇది యూనిట్‌ సమష్ఠి విజయం. అన్ని విభాగాలు కలిసి పని చేయడం వల్లే ఈ విజయం సాధించగలిగాము అన్నారు.


ఇక హరీష్ శంకర్ ఈ చిత్రం విజయం గురించి చెపుతూ..."స్క్రిప్టులో మార్పులు చేశామని ప్రేక్షకుల్ని సంసిద్ధం చేయడానికే నేను టైటిల్‌కార్డులో మార్పులు అని నా పేరు వేసుకున్నాను. పవన్ అభిమానిగానే సినిమా తీశాను. ఇప్పటికీ అదే భావనతో ఉన్నాను. పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు ప్రశంసించారు అని అన్నారు.

అలాగే సినిమాలో హైలెట్ అయిన అంత్యాక్షరి ఎపిసోడ్ గురించి చెపుతూ.. అంత్యాక్షరి సన్నివేశాన్ని ఎవరినీ ఉద్దేశించి చేయలేదు. పలువురు నటీనటుల్ని అనుకరించామంతే. అవమానించలేదు. ఆ సన్నివేశానికి పోలీసుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. 'గబ్బర్‌సింగ్' పవన్ ఒన్‌మ్యాన్ షోగానే నడిచింది. పాటలు, డ్యాన్సుల పట్ల ఆయన గొప్పగా శ్రద్ధ కనబరిచారు. సిగరెట్, మందు తాగే సీన్లు చేయడానికి మా హీరో ఇష్టపడలేదు. శ్రుతి మా సినిమాకు పెద్ద ఎసెట్. మా సినిమాలో జంట కొత్తగా ఉందని పలువురు కితాబిస్తున్నారు. నేను జయాపజయాలను నమ్మను. కష్టాన్నే నమ్ముతాను'' అని హరీష్‌శంకర్ అన్నారు.

ఇక హరీష్ శంకర్ తన తదపరి చిత్రం ఎన్టీఆర్ తో అని చెప్పారు. అలాగే ఆ తర్వాత రవితేజతో ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్ తో చేసే సినిమాని కొడాలి నాని నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ తో చేసే చిత్రం గతంలో ఎన్టీఆర్ కి చెప్పిన ఎమ్.ఎల్.ఎ స్క్రిప్టు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అప్పట్లో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు వరసగా పెద్ద హీరోలంతా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలని ఉత్సాహపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X