రికార్డుల కోసం' గబ్బర్ సింగ్'చూడొద్దు: హరీష్ శంకర్
నేను పవన్ అభిమానులకు ఒకటే చెబుతాను. మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన గబ్బర్ సింగ్ సినిమా కోసం చూడండి. పవన్ కోసం చూడండి. రికార్డులు ఆశించి చూడకండి అంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఆయన తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే..వెయ్యి థియేటర్లు, ఫస్ట్ వీక్ రికార్డులు, కలెక్షన్లు అన్నట్లు మా గబ్బర్ సింగ్ చిత్రం చూడొద్దు. సినిమా రికార్డులు అన్నవి వివిధ పరిస్థితులపై ఆధారపడి వుంటాయి. మరే సినిమాలు లేకపోవడం, థియేటర్ల అందుబాటు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి అన్నారు.
అలాగే నేను 'దబాంగ్' సినిమా రీమేక్ చేస్తున్నా అని అనుకోవడం లేదు. పవన్‌తో పూర్తి ఎంటర్నమెంట్ సినిమా తీస్తున్నా. మన నేటివిటీకి సంబంధించి అనేక మార్పులు చేసా. దబాంగ్‌లో వున్నది ఒకటే సాంగ్. ఇందులో అలా కాదు. ఇలా చాలా మార్పులు చేసాం అన్నారు. అలాగే 'దబాంగ్' కథ మనకే కాదు బాలీవుడ్‌కీ కొత్త కాదు. కానీ అందులో విషయం వుంది. దానికి మన నేటివిటీ జోడించాం..అందుకే చేశాం అన్నారు. అయినా దబాంగ్ సినిమాకు సంబంధించి కొన్ని వెసులుబాట్లున్నాయి. మన బీసీ సెంటర్లకు ఆ సినిమా చేరలేదు. పైగా మన బీసీ సెంటర్లలో హిందీ సినిమాలు చూసే వారు తక్కువ అన్నారు.
అలాగే పవన్ తో సినిమా చేయటం గురించి హరీష్ చెపుతూ..పవన్‌లో కూడా కనిపించని హై ఓల్టేజీ వుంది. అది ఇప్పుడు మీరు చూస్తారు. ఇంత వరకు ఆయన విలనిజాన్ని ఎక్కువగా ఫేస్ చేయని, లవ్‌లీ సబ్జెక్ట్‌లే చూసారు. ఇది ఆయనకు పూర్తిగా కొత్త సబ్జెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఇక పవన్ తో తన అనుభంధం చెపుతూ...నేను బిహెచ్‌ఇఎల్ ప్రాంతంలో చదువుకుంటూ, పెరిగినపుడు పవన్‌కళ్యాణ్ సినిమాలు పిచ్చపిచ్చగా చూసేవాణ్ణి. అలాంటిది ఆ మధ్య డిసెంబర్ నాలుగున తొలిషాట్ ఆయనపై తీసాను. ముందు వారం రోజుల దాకా అదే మూడ్‌లో వున్నా. ఆయన ఎలా చేసినా, ఫస్ట్ టేక్ ఓకె అనడమే. ఆయనే గుర్తు చేసేవారు.. 'శంకర్, సరిపోతుందా..లేదా' అని అంటూ గుర్తు చేసుకున్నారు.
ఇక గబ్బర్ సింగ్ చిత్రం ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ఆనంద ఉత్సాహాల మధ్య భారీగా విడుదలైంది. దబాంగ్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ చేసింది. విలన్ గా అబిమన్యు సింగ్ చేస్తే..పవన్ తల్లిగా సుహాసిని,సవితి తండ్రిగా నాగినీడు చేసారు. అలాగే కథలో మరో కీలకమైన పాత్ర అయిన పవన్ తమ్ముడు పాత్రను అజయ్ చేసాడు. అజయ్ ప్రేమించే అమ్మాయిగా హ్యాపీడేస్ ఫేమ్ గాయిత్రి చేసింది. హీరోయిన్ తండ్రిగా కోట శ్రీనివాసరావు,కానిస్టేబుల్ సాంబ గా అలీ చేసారు.


Click it and Unblock the Notifications











