దూకుడులో పాట సరిగ్గా రాశారు.. నా స్టైల్‌లో కూడా కనిపించాలి, మహేష్‌కు హరీష్ రిక్వస్ట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన సమ్మోహనం ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. సమ్మోహనం చిత్ర యూనిట్ తో పాటు ఇతర అతిథులు చాలా మంది హాజరయ్యారు. మహేష్ తో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన కొరటాల శివ, త్వరలో మహేష్ 25 వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, దిల్ రాజు వంటి ప్రముఖులంతా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ ప్రసంగం ఆకట్టుకుంది. మహేష్ గురించి హరీష్ చెప్పిన మాటలు ఆయన అభిమానులని ఆకట్టుకున్నాయి. బిజినెస్ మాన్, పోకిరి చిత్రాల్లో చూస్తే మహెష్ బాబు పూర్తిగా పూరిజగన్నాథ్ బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల్లో కొరటాల స్టైల్ లో కనిపిస్తారు. త్వరలో వంశీ పైడిపల్లి స్టైల్ లో కనిపించబతోతున్నారు.
మహేష్ బాబు పాదరసం లాంటి వారని, దర్శకుడు ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చని హరీష్ తెలిపాడు. దూకుడు చిత్రంలో టైటిల్ సాంగ్ లోని పాదరస ఒరవడి నరనరమే అనే వాక్యం మహేష్ కు సరిగ్గా సరిపోతుందని హరీష్ తెలిపాడు. అలాగే మహేష్ బాబు నా స్టైల్ లో నటించడానికి ఓ అవకాశం ఇవ్వాలని కోరాడు.


Click it and Unblock the Notifications











