చిరుతో రౌడీ అల్లుడి లాంటి సినిమా.. కేవలం వీడియో కోసమే ఆ పని చేయాలి.. హరీష్ శంకర్ కామెంట్స్
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మెగా కాంపౌండ్ మొత్తాన్ని ఓ సారి చుట్టేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో పని చేశాడు. మరోసారి పవన్ కళ్యాణ్‌తో ఓ ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ ప్రాజెక్ట్ లైన్లో ఉందని తెలిపాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్.. అనేక విషయాలను వెల్లడించాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

కేవలం వీడియో కోసమే..
ప్రస్తుతం టాలీవుడ్‌లో బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కామెంట్ చేస్తూ.. దేవీశ్రీప్రసాద్ తనను నామినేట్ చేశాడని తెలిపాడు. కానీ నిజం చెబుతున్నా, తాను పని చేసాను అంటే కేవలం వీడియో కోసం చేయాలని తెలిపాడు. ఎందుకంటే ఇంట్లో పూచికపుల్ల పని కూడా తనకు చెప్పరని పేర్కొన్నాడు. తిన్న కంచం సింక్‌లో పడేసే వరకేనని.. పని చేస్తే వర్క్ డబుల్ అవుతుంది మా ఆవిడ వద్దంటుందని చెప్పుకొచ్చాడు.

ఆచారాలు, సంప్రదాయాలు..
హరీష్ శంకర్ ఆచారాలు, సంప్రదాయాలు గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు కరోనా టైమ్ కదా, సంధ్యావందనం చేస్తున్నానని తెలిపాడు. సినిమాలు వున్నపుడు జస్ట్ గాయత్రీ మంత్రం చదివేసుకుని వెళ్లిపోతానని పేర్కొన్నాడు. ఇక నాన్ వెజ్ తినడం అన్నది ఒకటి రెండు సార్లు ట్రయ్ చేసానని కానీ ఎందుకో నచ్చలేదని అందుకే వదిలేశానని చెప్పుకొచ్చాడు.

రౌడీ అల్లుడు లాంటి సినిమా..
మెగా హీరోలతో సినిమా విశేషాలు చెబుతూ.. పవర్ స్టార్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేస్తుందని పేర్కొన్నాడు. అలాగే మెగాస్టార్ సినిమా కూడా వుంటుందని తెలిపాడు. రౌడీ అల్లుడు లాంటి ఎంటర్టైనర్ చేయాలని ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అలాగే చరణ్ తో కూడా చేసేస్తే మొత్తం మెగా హీరోలను కవర్ చేసిన సంతృప్తి వచ్చేస్తుందని అన్నాడు.

చదవడమే ఇష్టం..
వెబ్ సిరీస్‌లు, సినిమాలు దాదాపు అన్నీ చూసేశానని. తాను చదవడాన్నే ఇష్టపడతానని తెలిపాడు.ఒకవేళ తాను చూస్తే బాగా ప్రభావితం అయిపోతానని.. నచ్చేసిందంటే రీ మేక్ చేసేయాలనుకుంటానని తెలిపాడు. నచ్చితే చాలు వెంటనే నిర్ణయం తీసుకుంంటానని అన్నాడు. అందుకే తక్కువ చూసి, ఎక్కువ చదవాలనుకుంటానని తెలిపాడు.


Click it and Unblock the Notifications











