‘గబ్బర్ సింగ్’లో ఇది గమనించారా?.. అభిమాని అడగడంతో సీక్రెట్ చెప్పిన హరీష్ శంకర్
గబ్బర్ సింగ్ సినిమా ఇటు ఇండస్ట్రీలోనే కాకుండా అటు సగటు సినీ ప్రేక్షకుల్లోనూ చెరగని ముద్ర వేసింది. కేవలం మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానులే కాకుండా సినీ ప్రేమికులందరూ ఆస్వాధించదగ్గ చిత్రం. అందుకే గబ్బర్ సింగ్ బుల్లితెరపై ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేస్తూనే ఉంటుంది. సినిమా కథ చిన్నదే అయినా.. పవన్ కళ్యాణ్ స్టైల్, మ్యానరిజం, డైలాగ్స్, లుక్ అన్నీ కొత్తగా ఉంటాయి. అంత వరకు చూసిన పవన్ కళ్యాణ్‌ను గబ్బర్ సింగ్‌లో వంద రెట్ల ఉత్సాహంతో మనం చూస్తాం.

హరీష్ శంకర్ టేకింగ్..
గబ్బర్ సింగ్ చిత్రం అంతటి విజయం నమోదు చేయడానికి ముఖ్య కారణం హరీష్ శంకరే. దబాంగ్ వంటి ఓ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి.. అది పూర్తిగా ఒరిజినల్ చిత్రమనేట్టుగా మలచడంలో హరీష్ శంకర్ సఫలమయ్యాడు. ప్రతీ ఒక్క చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెటప్, లుక్స్, డైలాగ్స్‌పై మరింత శ్రద్ద పెట్టాడు.

పోలీస్ యూనిఫాం..
గబ్బర్ సింగ్ ముందు వరకు పోలీస్ ఆఫీసర్ అంటే యూనిఫాం వేసుకునే ఉండాలని భావించేవారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాలో చాలా తక్కువ సీన్లలోనే యూనిఫాంతో కనిపిస్తాడు. అది కూడా కాస్త డిఫరెంట్‌గానే ధరిస్తాడు. అయితే సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ మాత్రం పోలీస్ క్యాప్ పెట్టుకోడు.

అభిమాని ప్రశ్న..
పోలీస్ అంటే సాధారణంగా తలపై టోపీ, చేతిలో లాఠీ, ఒంటిపై ఖాకీ చొక్కా. కానీ గబ్బర్ సింగ్ స్టైల్ వేరు. అలాంటివేవీ ఉండవు. నెత్తిపై టోపీ ఎందుకు పెట్టలేదని తాజాగా ఓ అభిమాని దర్శకుడు హరీష్ శంకర్‌ను అడిగాడు. దానికి స్పందించిన హరీష్ శంకర్ నెటిజన్‌కు ఆన్సర్ ఇచ్చాడు.
Recommended Video

అందుకే పెట్టలేదు..
గబ్బర్ సింగ్ చిత్రంలో సరిగా గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ అంతకు ముందున్న చిత్రాల కంటే కొత్తగా, సూపర్బ్‌గా ఉంటుంది. ఖుషి టైమ్ హెయిర్ స్టైల్‌ను గుర్తుకు తెస్తుంది. పైగా హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ హెయిర్స్ అంటే చాలా ఇష్టమట. అందుకే క్యాప్ పెట్టకుండానే కానిచ్చేశారట. ఒకవేళ క్యాప్ పెడితే హెయిర్ స్టైల్ దెబ్బతింటుంది కదా.


Click it and Unblock the Notifications











