twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ అందుకోసం రాజకీయాల్లోకి రాలేదు.. ఎలక్షన్స్ ఓటమిపై హరీష్ శంకర్ కామెంట్

    |

    టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎంతటి స్టార్ దర్శకుడైనా కూడా హరీష్ ఒక పవన్ అభిమానిగానే ఉండడానికి ఇష్టపడతాడు. కట్టే కాలే వరకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అంటూ ఎన్నో సందర్భాలలో వివరణ ఇచ్చారు. ఇక మొదటిసారి పవన్ ఓటమిపై గబ్బర్ సింగ్ దర్శకుడు ఊహించని విధంగా స్పందించారు.

    అపజయాలు వచ్చినా కూడా

    అపజయాలు వచ్చినా కూడా

    ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్, పవన్ గురించి అనేక రకాల విషయాలను తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఒక స్టార్ హీరోగా కంటే కూడా ఆయన వ్యక్తిగత శైలిని చూసే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఆయనకు అంతగా అపజయాలు వచ్చినా కూడా చాలా సమయాల్లో ఆయనకి మద్దతు ఇచ్చారు.

     సంభంధం లేని పాత్రను నేను చేయలేను

    సంభంధం లేని పాత్రను నేను చేయలేను

    పవన్ వ్యక్తిగత శైలిని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అలాగే వెండితెరపై కూడా ఆయన కొత్తగా ఎదో ట్రై చేయరు. కామెడీ, డ్యూయెట్ లో ఎదో కొంత డిఫరెన్స్ ఉంటుందేమో తెలియదు గాని ఆయన సొంత స్టైల్ లోనే ఎక్కువగా నటిస్తారు. నాకు సంభంధం లేని పాత్రను నేను చేయలేను అని డైరెక్ట్ గా చెప్పేస్తారు.

    అలాంటి సమయంలో ప్రజలకు మంచి చేయాలని

    అలాంటి సమయంలో ప్రజలకు మంచి చేయాలని

    ఇక పవన్ రాజకీయాలపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హరీష్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ ఒక పీక్ స్టేజ్ లో ఉండగా రాజకీయాల్లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది లాంటి బాక్సాఫీస్ హిట్టు సినిమాల తరువాత ఆయన మార్కెట్ ఒక రేంజ్ లోకి వెళ్లింది. అలాంటి సమయంలో ప్రజలకు మంచి చేయాలని పార్టీ స్థాపించారు.

    అందుకోసం రాజకీయాల్లోకి రాలేదు

    అందుకోసం రాజకీయాల్లోకి రాలేదు

    డబ్బు ఆస్తులు వెనకేసుకోవాలని మాత్రం పవర్ స్టార్ రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలోనే సంపాదించుకోవడానికి ఆయనకు అవకాశం చాలానే ఉంది. కానీ తనకు ఇంతగా ఆరాధించే ప్రజలకు ఎదో ఒక మంచి చేయాలని ఆయన తపన పడుతున్నారు. అందుకే పాలిటిక్స్ లోకి వచ్చారు.

    Recommended Video

    ఇండస్ట్రీ లో ఆయనే నా 'గాడ్ ఫాదర్'!!
    ఓటమిపై విశ్లేషించే అవగాహన నాకు లేదు

    ఓటమిపై విశ్లేషించే అవగాహన నాకు లేదు

    ఇక ఆయన రాజకీయ ఓటమిపై స్పందించే అవగాహన నాకు లేదు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను చెప్పేది ఒక్కటే. వృధా ప్రయాస అనే ఒక పదం ఉంటుంది. అదే మీరు ఇప్పుడు చేస్తున్నారు అని హరీష్ పవన్ ఓటమిపై తనకు పెద్దగా రాజకీయా విశ్లేషణ లేదని అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ని ఏ ఓటమి కూడా అపలేదని కూడా హరీష్ వివరణ ఇచ్చారు.

    English summary
    Power star Pawan Kalyan's name is an unknown Josh among his fans. There are a lot of people who follow the trend. But there are some who set the trend. Pawan Kalyan is one of such heroes. Pawan's approach as a socially responsible citizen, not just with movies, has given him a good craze. Today, on the occasion of Pawan Kalyan's 49th birthday, his fans all over the world are offering huge wishes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X