అది ఎప్పటికీ మాస్ చిత్రం కాలేదు.. పవన్ కళ్యాణ్‌ను ఫ్యాన్‌గానే చూస్తా.. హరీష్ కామెంట్స్
మాస్ పల్స్ తెలిసిన టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ ముందు వరుసలో ఉంటాయి. హీరోయిజాన్ని, కామెడీ టైమింగ్‌ను ఎలా వాడుకోవాలో తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్. ప్రస్తుతం కరోనా వైరస్ భయానికి అందరూ ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇంటి పట్టునే ఉన్నా తన భాద్యతను మాత్రం విస్మరించడం లేదు. చేతనైనవారికి సాయం చేస్తూ, తన సినిమాకు సంబంధించిన పనులను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

క్వారంటైన్ కొత్తేమీ కాదు..
ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుతూ.. రచయితలకు క్వారంటైన్, ఐసోలేషన్ వంటివి కొత్తేమీ కాదని చెప్పుకొచ్చాడు. తామెప్పుడూ ఒంటరిగానే ఉంటామని తెలిపాడు. అయితే ఇప్పుడు మాత్రం ఈ వ్యాధి అనేది కొత్తగా ప్రబలుతోందని, దీని గురించే ఆలోచిస్తున్నాం, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని తెలిపాడు.

వారి ప్రభావం ఎక్కువ..
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం ఇష్టమని, తన తండ్రి తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో సాహిత్యంపై మక్కువ ఏర్పడిందని తెలిపాడు. జంధ్యాల, ముళ్లపూడి వెంకట రమణ, ఈవీవీ, పూరీ జగన్నాథ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

శంకరాభరణం ఎప్పటికీ మాస్ చిత్రం కాలేదు..
తనను మాస్ డైరెక్టర్ అని అనడంపై స్పందిస్తూ.. మాస్ అంటే ఎక్కువమందికి రీచ్ అయ్యే చిత్రాన్ని తీయడమనే అర్థమని తెలిపాడు. శంకరాభరణం చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒకటి గమనించానని అది మాస్ చిత్రం కాదని, అయితే మనం క్లాసికల్ చిత్రంగా చెప్పుకుంటామని తెలిపాడు.
Recommended Video

పవన్‌ను ఫ్యాన్‌గా చూస్తాను..
తాను పవన్ కళ్యాణ్‌ను చూసేప్పుడు డైరెక్టర్ కళ్లతో చూడనని, ఓ ఫ్యాన్‌గానే చూస్తానని వివరించాడు. తన తదుపరి ప్రాజెక్ట్‌లో అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి కోరుకునే ప్రతీ ఒక్క అంశం ఉంటుందని తెలిపాడు. ఆ చిత్రం ఆయనకు ఫ్యాన్స్‌ను ఇంకాస్త దగ్గర చేస్తుందని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











