twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ లేకపోతే నేను లేను: హరీష్ శంకర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : షాక్ ఫ్లాపయినా రవితేజ నన్నెప్పుడూ ఫ్లాప్ డెరైక్టర్‌గా చూడలేదు. 'మిరపకాయ్' చేసే అవకాశం ఇచ్చి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అందుకే రవితేజ లేని నా ఫిలిం కెరీర్ లేదు అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్. ఆయన తన తొలి చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే..నిజంగా రామ్ గోపాల్ వర్మ ఇన్‌వాల్వ్ అయి ఉంటే షాక్ సినిమా బెటర్‌గా వచ్చి ఉండేదేమో. చివరకు నాకు అర్థమైందేంటంటే, మనకి ఏది వచ్చో అదే చేయాలి. మనకు రాని దాన్ని మనం ముట్టుకోకూడదు. అలా చేస్తే దానికి న్యాయం చేయలేం అని ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను అని అన్నారు.

    రవితేజ తో తన పరిచయం గురించి చెప్తూ... దుర్గా ఆర్ట్స్‌లో అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేసేవాణ్ని. డెరైక్టర్ ఎవరైనా నేను మాత్రం కంపెనీ తరఫున అసోసియేట్‌గా చేసేవాణ్ని. నేను, నారాయణగారు, గోపాల్‌రెడ్డిగారు కలిసి కొత్త కథలు వినేవాళ్లం. దుర్గా ఆర్ట్స్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామనుకుని ఎన్ని కథలు విన్నా నచ్చలేదు. అదే సమయంలో కోన వెంకట్ ద్వారా రవిరాజా పినిశెట్టి దగ్గర 'వీడే' సినిమాకు అసోసియేట్‌గా చేరాను. ఆయన దగ్గరే డెరైక్షన్‌లో ఓనమాలు నేర్చుకున్నాను. ఆ సమయంలో రవితేజతో మంచి పరిచయం ఏర్పడింది. తరువాత మళ్లీ గోపాల్‌రెడ్డిగారు చెప్పగానే ఆటోగ్రాఫ్ సినిమాకు కో-డెరైక్టర్‌గా వెళ్లాను. అప్పుడు నాకు, రవితేజకు మధ్య స్నేహం బాగా పెరిగింది. నేను తనతో ఎప్పుడూ ఒక కో-డెరైక్టర్‌గా ఉండలేదు. తను నన్నెప్పుడూ ఒక తమ్ముడిగా, ఫ్రెండ్‌గానే చూశాడు అన్నారు.

    ప్రస్తుతం హరీష్ శంకర్ ..ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అద్బుతంగా ఉంటుందని చెప్తున్నారు.

    బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    English summary
    Harish Shankar Says that Raviteja is his best Friend. It was Ravi Teja who gave me birth and rebirth as a director. During the shooting time of Shock he said that he would do another film with me irrespective of the commercial outcome of Shock. I was feeling guilty all this while and didn’t approach him. He called me and asked me for a story. Then I narrated the script of Mirapakai. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X