అడ్డదారిలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్!
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'గబ్బర్ సింగ్' చిత్ర దర్శకుడు హారిష్ శంకర్ పబ్లిసిటీ కోసం అడ్డదారి తొక్కుతున్నారా? అందుకే మీడియాపై నోటిదూల ప్రదర్శిస్తున్నారా? అంటే అవును అనే అనిపిస్తోంది ఆయన తీరు చూస్తుంటే. ఇంతకు ముందు మిరపకాయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన హారిష్ ఆ సినిమా హిట్టయినా....సినీ సర్క్యూట్ లో పెద్దగా పబ్లిసిటీ సంపాదించుకోలేక పోయాడు. తాజాగా గబ్బర్ సింగ్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించే చర్చించుకుంటున్నారే తప్ప తనను ఎవరూ పట్టించుకోవడం లేదు.
దీంతో పబ్లిసిటీ పెంచుకోవడానికి రామ్ గోపాల్ వర్మ అనుసరిస్తున్న అడ్డదారిని ఎంచుకున్నాడు హారిష్ శంకర్...ట్విట్టర్ ద్వారా మీడియాపై, పవన్ కళ్యాన్ అభిమానులపై విమర్శలు చేస్తూ వార్తల్లోకెక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల తన ట్విట్టర్ ద్వారా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన హారిష్ శంకర్....తాజాగా మీడియాపై పడ్డాడు. 'పూర్ మీడియా...వాళ్లు బతకాలిగా' అంటూ ట్వీటాడు. పవన్ కళ్యాణ్ పంజా సినిమా గురించి మీడియా వాస్తవాలు మాట్లాడటం హారిష్ కు కోపం తెచ్చింది... అందుకే మీడియాపై ఈ ఏడుపు. వాస్తవానికి గబ్బర్ సింగ్ సినిమాను అందరి దృష్టి మరల్చడానికే హారిష్ శంకర్ ఇలా చేస్తున్నాడని మరికొందరంటున్నారు.


Click it and Unblock the Notifications











