twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫాంహౌస్‌లో ఉన్నారో ఫాంలో ఉన్నారో తేల్చి చెప్పిన జనం: దర్శకుడి సంచలనం

    |

    తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికారం దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్ పార్టీకి తెలుగు సినిమా ప్రముఖుల నుంచి ఊహించని మద్దతు లభిస్తోంది. ఇప్పటికే మంచు మనోజ్, కోన వెంకట్ లాంటి వారు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.

    తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫాం హౌస్‌లో ఉన్నారో, ఫాంలో ఉన్నారో తేల్చి చెప్పిన జనం... అంటూ హరీష్ ట్వీట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు, కవిత రావుకు కంగ్రాట్స్ చెప్పారు.

    హరీష్ శంకర్ ట్వీట్ హాట్ టాపిక్

    హరీష్ శంకర్ ట్వీట్ హాట్ టాపిక్

    కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఫాంహౌస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.... ఆ ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారని చెబుతూ హరీష్ శంకర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది.

     పవర్ ఆఫ్ డెమోక్రసీ

    పవర్ ఆఫ్ డెమోక్రసీ

    టీఆర్ఎస్ గెలుపును హరీష్ శంకర్ పవర్ ఆఫ్ డెమోక్రసీ అంటూ పేర్కొనడం గమనార్హం. హరీష్ శంకర్ ఇలాంటి ట్వీట్ చేయడంపై తెలంగాణ ప్రాంత వాసుల నుంచి హర్షం వ్యక్తం అవుతుండగా, కొందరు టీఆర్ఎస్ వ్యతిరేకులు మాత్రం నీ భజన అపు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

    సెటిలర్లు అభివృద్ధికే ఓటేశారు: బివిఎస్ రవి

    సెటిలర్లు అభివృద్ధికే ఓటేశారు: బివిఎస్ రవి

    సెటిలర్లు అభివృద్ధికి, ప్రగతిశీల నాయకత్వానికి ఓటేశారు అని ఈ రోజు మరోసారి రుజువైంది... అంటూ ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి తన ట్వీట్ ద్వారా తేల్చి చెప్పారు.

    ఆరు నెలల హడావుడి అరగంటలో...

    ఆరు నెలల హడావుడి అరగంటలో...

    ఆరు నెలల హడావుడి అర గంటలో ముగిసింది అని బివిఎస్ రవి స్పష్టం చేశారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అని ఏ ముహూర్తాన రాశారో కానీ మీ గురంచే రాసినట్లు ఉన్నారు సార్.. కంగ్రాట్స్ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

    English summary
    "This day shud put an end to the term “Settlers” who actually voted for development and progressive political leadership.Hyderabad is an emerging world city & a celebrated metro and let it be! KTRTRS you’re d Face of the new Hyd now and the city has stamped it! Congratulations." BVS Ravi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X