'రచ్చ' రోజు పవన్ నిజంగానే వూళ్లో లేరు: హరీష్ శంకర్
''పవన్ కళ్యాణ్ వూళ్లో ఉండి కూడా 'రచ్చ' పాటల వేడుకకి హాజరుకాలేదని ఇటీవల ఓ పత్రికలో రాశారు. అది అవాస్తవం. ఆ రోజు పవన్ నిజంగానే వూళ్లో లేరు. అసలు మన దేశంలోనే లేరు'' అన్నారు 'గబ్బర్‌సింగ్' చిత్ర దర్శకుడు హరీష్‌శంకర్. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే 'గబ్బర్‌సింగ్' క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ ని ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని నేను ట్విట్టర్‌లో రాశాను. అయితే పవన్‌కల్యాణ్ వూళ్లో లేకుండా క్త్లెమాక్స్ సన్నివేశాలు ఎలా తీస్తారు? ఆ లెక్కన ఆయన హైదరాబాద్‌లో ఉండే 'రచ్చ' ఆడియో వేడుకకు హాజరు కాలేదని వూహిస్తూ ఆ పత్రికలో వార్త రాశారు. సినిమాలో ఇరవై సుమోలతో ఓ ఛేజింగ్ సన్నివేశం ఉంది. వాటిలో హీరో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే పవన్ అమెరికాకి వెళ్లారు. రూమర్స్ ని అభిమానులు పట్టించుకోవల్సిన అవసరం లేదు అన్నారు.
అంతకుముందు రోజు ఓ పాపులర్ ఇగ్లీష్ డైలీలో ఈ విషయమై ఓ కథనం వెలువడింది. అందులో హరీష్ శంకర్ రాసిన ఓ ట్వీట్ ఆధారంగా పవన్ ఊళ్ళైనే ఉండి రచ్చ పంక్షన్ కి హాజరు కాలేదు అని ఊహించి రాసారు. హరీష్ శంకర్ ఆ ట్వీట్ లో... రచ్చ ఆడియో పంక్షన్ మిస్ అవుతున్నాను. రేపు తియ్యాల్సిన గబ్బర్ సింగ్ క్లైమాక్స్ ప్రిపరేషన్ లో ఉన్నాను అన్నారు. అంటే ఆ మరుసటి రోజు పవన్ క్లైమాక్స్ షూట్ లో పాల్గొన్నారన్నమాట. అలాగే.. రామ్ లక్ష్మణ్ లు తమ ట్వీట్ లో... పవన్ సార్ తో వర్క్ చేస్తున్నాం... ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నాం అని మార్చి 12న ట్వీట్ చేసారు. ఈ రెండు ట్వీట్స్ ఆదారంగా ఆ కథనం రెడీ అయ్యింది. అయితే హరీష్ శంకర్ దానిని ఖండిస్తూ ఇలా వివరణం ఇచ్చారు. ఇక 'గబ్బర్ సింగ్' అందర్నీ అలరించేలా సిద్ధమవుతోంది. ఏప్రిల్ మొదటివారంలో పాటల్ని విడుదల చేస్తామని హరీష్ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











