ఎన్టీఆర్ చిత్రం గురించి హరీష్ శంకర్ క్లారిఫికేషన్

By Srikanya

హైదరాబాద్ : హరీష్ శంకర్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ ఇప్పటివరకూ ఇంకా పెట్టలేదు. అయితే రీసెంట్ గా హరీష్ శంకర్..పండుగ చేసుకో అనే టైటిల్ ని రిజిస్టర్ చేసారు. దాంతో ఎన్టీఆర్ చిత్రం టైటిల్ పండగ చేసుకో అని మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. ఈ విషయమై హరీష్ శంకర్ ట్విట్టర్ లో క్లారిఫికేషన్ ఇచ్చారు.

హరీష్ శంకర్ ఇచ్చిన ట్వీట్ లో... " గయ్స్ స్మాల్ క్లారిఫికేషన్... "పండుగ చేసుకో" అనేది మా సినిమా టైటిల్ కాదు బాద్షా చిత్రం విడుదల తర్వాత ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేస్తాం " అన్నారు. . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో వచ్చిన బృందావనం హిట్ కావటంతో ఈ కాంబినేషన్ పై మరింత అంచనాలు పెరుగుతాయి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. గబ్బర్ సింగ్ తో తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్న హరీష్ ఈ చిత్రంతో తెలుగులో తిరుగులేని దర్శకుడుగా ఎదుగుతాడంటున్నారు.

మరో ప్రక్క గతంలో ఎన్టీఆర్ తో బృందావనం వంటి హిట్ చిత్రం తీసిన దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X