మీరు కూడా గాసిప్స్ రాయడం ఊహించుకోలేకపోతున్నాం.. PSPK28 హీరోయిన్‌ వార్తలను ఖండించిన హరీష్

అసలే ప్రస్తుతం ఇండస్ట్రీలో కిల్ ఫేక్ న్యూస్, గాసిప్ వెబ్‌సైట్స్‌పై నియంత్రణ ఉండాలనే టాక్ బలంగా నడుస్తోంది. విజయ్ దేవరకొండ విషయంలో జరిగిన ఓ తప్పుతో చిత్ర సీమ మొత్తం కదిలివచ్చింది. ఆయనపై తప్పుడు వార్తలను రాయడాన్ని అందరూ ఖండించారు.

ఇలాగే వదిలేయకూడదని ఫేక్ న్యూస్, గాసిప్స్ రాసే వెబ్‌సైట్స్‌కు వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సినీ పెద్దలంతా కార్యాచరణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే వీటికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే అవకాశాలున్నాయి. అయితే హరీష్ శంకర్ తన చిత్రంపై వచ్చిన రూమర్లను స్పందిస్తూ తెగ ఫీలైపోతోన్నాడు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

 గాసిప్స్, రూమర్స్ అనేవీ కామన్..

గాసిప్స్, రూమర్స్ అనేవీ కామన్..

ఓ సినిమాకు సంబంధించి గాసిప్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఇవి కూడా ఇండస్ట్రీలోని ఎవరి నోటనో వచ్చిన వార్తే అయి ఉంటుంది. కానీ వాటికి కచ్చితత్వం ఉండదు. నిజంగా జరగవచ్చు లేదా చివరి నిమిషంలో ఏదైనా మార్పు సంభవించవచ్చు. అందుకు వాటికి గాసిప్స్ లేదా రూమర్స్ అనే ట్యాగ్ అంటిస్తూ వార్తలు రాస్తుంటారు.

ఎనిమిదేళ్ల గబ్బర్ సింగ్..

ఎనిమిదేళ్ల గబ్బర్ సింగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ స్టామినా ఏంటో నిరూపించిన చిత్రం.. ఓ అభిమాని గనుక హీరోను డైరెక్ట్ చేస్తే రికార్డులు ఎలా క్రియేట్ చేస్తాడో చూపించిన చిత్రం గబ్బర్ సింగ్. అప్పటి వరకు డిజాస్టర్లతో కొట్టుమిట్టాడుతున్న పవన్ కళ్యాణ్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు ఊపిరి పోశాడు హరీష్ శంకర్. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న రికార్డులన్నంటిని బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంలో హరీష్ శంకర్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ అందించాడు.

దేవీ సంగీత సారథ్యంలో..

దేవీ సంగీత సారథ్యంలో..

గబ్బర్ సింగ్ అంతటి ఘన విజయం సాధించడానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఓ ముఖ్య కారణమే. ఇప్పటికే ఆ పాటలు మార్మోగుతూనే ఉంటాయంటే దాని ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్‌తో తాను చేయబోయే చిత్రానికి దేవీ సంగీతాన్ని అందించబోతోన్నాడని హరీష్ శంకర్ తెలిపాడు.

Recommended Video

#Tollywood : This Famous Director Lost A Chance To Direct The Pawan Kalyan Movie | Filmibeat Telugu
హీరోయిన్ ఆమె అంటూ రూమర్స్..

హీరోయిన్ ఆమె అంటూ రూమర్స్..

పవన్ చిత్రంలో మళయాలం హీరోయిన్‌ను తీసుకున్నట్టు నిన్న వార్తలు హల్చల్ చేశాయి. పవన్ కల్యాణ్ సరసన మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ నటిస్తున్నట్టు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. అయితే వీటిపై హరీష్ శంకర్ ఫీలైనట్టు కనిపిస్తోంది.

తెలుగులోనే అతి పెద్ద మీడియా సంస్థ కూడా పవన్ హీరోయిన్‌ అంటూ గాసిప్స్ రాయడంపై స్పందిస్తూ.. ‘మనం ఫోన్‌లో తరుచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. పైగా నేను సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులోనే ఉంటాను.. మీరు కూడా గాసిప్స్ రాయడం ఊహించుకోలేకపోతున్నాం..' అని ఓ ట్వీట్ చేశాడు. దీంతో మలయాళ హీరోయిన్ అని వచ్చిన వార్తలన్నీ రూమర్సేనని తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X