»   »  ‘రామయ్యా వస్తావయ్యా’ రిలీజ్ డేట్ పై హరీష్ శంకర్

‘రామయ్యా వస్తావయ్యా’ రిలీజ్ డేట్ పై హరీష్ శంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో వేడిక్కిన రాజకీయ పరిణామాలతో పెద్ద సినిమాలు అన్నీ విడుదల తేదీలును మార్చుకుంటున్నాయి. అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తమ చిత్రం విడుదల తేదీ మాత్రం మారదని, మొదట అనుకున్న రోజు విడుదల అవుతుందని చెప్తున్నారు. ఈ విషయమై ఆయన మరో సారి ట్వీట్ చేసారు. ఎన్.టి.ఆర్ తో తెరకెక్కిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుందని మరోసారి స్పష్టం చేసాడు. అంతేకాక డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

ఆ ట్వీట్ లో... సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని, అనుకున్న సమయానికే వస్తుందని అలాగే మూవీకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపాడు. 'జూ ఎన్టీఆర్ లాంటి సింగిల్ టేక్ ఆర్టిస్టుతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో పని చేస్తే షూటింగ్ ఆలస్యం అవుతుందనే టెన్షనే ఉండదు. ఆయనది నమ్మశక్యంకాని మెమోరీ పవర్' అంటూ ట్వీట్ చేసాడు.

ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆడియో ఆగస్టు 23న శిల్పకళా వేదికలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary
Harish Shankar has reconfirmed that NTR’s ‘Ramayya Vastavayya’ will release on September 27th, as scheduled. He has also revealed that the dubbing work of the film is underway. This news has brought cheer to NTR’s fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu