PSPK28 update: పవన్, హరీష్ శంకర్ మూవీ టైటిల్ లీక్.. ఎవరూ ఊహించని పాత్రలో పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్‌గా మారిపోయింది. పాలిటిక్స్ ప్రవేశించి బీజీ అయిపోవడం వల్ల రెండేళ్లకుపైగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అయితే వకీల్ సాబ్‌ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కరోనావైరస్ సమయంలో కూడా దేశంలో ఏ పరిశ్రమలో కూడా ఏ హీరో సాధించనట్టుగా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల రూపాయలను వకీల్ సాబ్ వసూలు చేసింది.

దాంతో పవన్ కల్యాణ్ స్టామినా దేశవ్యాప్తంగా ఏమిటో తెలిసిపోయింది. అయితే తాజాగా పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా మారారు. తాజాగా హరీష్ శంకర్‌తో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా టైటిల్స్ గురించిన విషయం మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

వరుస చిత్రాలతో పవన్ కల్యాణ్

వరుస చిత్రాలతో పవన్ కల్యాణ్

వకీల్ సాబ్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఒకటి అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ భీమ్లా నాయక్ కాగా, మరోటి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాలు కరోవైరస్ కారణంగా షూటింగులు వాయిదాపడటం, అలాగే రిలీజ్ డేట్ కూడా కాస్త ముందుకు వెళ్లడం జరిగింది.

ట్రెండింగ్‌గా మారిన భీమ్లా నాయక్

ట్రెండింగ్‌గా మారిన భీమ్లా నాయక్

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. రానా దగ్గుబాటి, నిత్య మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ రిలీజై ప్రేక్షకులకు, అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. రికార్డు వ్యూస్ సాధిస్తూ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 మరో ఇండస్ట్రీ హిట్ కోసం మైత్రీ, పవన్, హరీష్ శంకర్

మరో ఇండస్ట్రీ హిట్ కోసం మైత్రీ, పవన్, హరీష్ శంకర్

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లో అద్బుతమైన చిత్రంగా నిలిచిపోయింది. మళ్లీ వారిద్దరి కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ శుభవార్తను అందించింది. గతంలో మైత్రీ బ్యానర్‌లో సినిమా చేసేందుకు అంగీకరించిన పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హరీష్‌తో సినిమా పట్టాలెక్కింది.

పవన్ కోసం రెండు టైటిల్స్ రిజిస్టర్

పవన్ కోసం రెండు టైటిల్స్ రిజిస్టర్

అయితే హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించనున్న సినిమాకు సంబంధించిన రెండు టైటిల్స్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్టు సమాచారం. అందులో ఒకటి భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ కాగా, మరోటి సంచారి అనే టైటిల్‌ను పెట్టేందుకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ రెండు టైటిల్స్ కూడా కిర్రాక్ పుట్టిస్తున్నాయనేది అభిమానులు అభిప్రాయపడుతున్నాయి.

Recommended Video

PSPK 28 : స్క్రిప్ట్ కెవ్వుకేక, మరో గబ్బర్ సింగ్ కి గెట్ రెడీ | Pawan Kalyan || Filmibeat Telugu
లెక్చరర్ పాత్రలో పవన్ కల్యాణ్

లెక్చరర్ పాత్రలో పవన్ కల్యాణ్

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో పవన్ కల్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఇలాంటి పాత్రలో పవర్ స్టార్ కనిపించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వ్యవహరిస్తున్న #PSPK28 చిత్రంలో రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో పవన్ కల్యాణ్ నటించబోతున్నారు అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X