గబ్బర్ సింగ్ లో ఆ డైలాగు 'ఈగ' గురించేనా?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ రిలీజైన మార్నింగ్ షో కే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రంలో ఓ డైలాగు రాజమౌళి ఈగ చిత్రాన్ని గుర్తు చేస్తోందంటున్నారు. ఈ నెలాఖరకు విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ఉద్దేశించే హరీష్ శంకర్ ఆ డైలాగు రాసాడంటున్నారు. ఇంతకీ ఆ డైలాగు ఏంటంటే...ఈగ వాలితే మీరు చూసుకోండి...ఇంకా ఏదైనా వాలితే నేను చూసుకుంటాను.
ఈ డైలాగు సినిమా ప్రారంభంలో పవన్ ఇంట్రడక్షన్ ఫైట్ అయ్యాక.. ..దొంగలను పట్టుకుని ఎవరు డబ్బు వారికి ఇచ్చేసాక కొండవీడు జనాలని ఉద్దేశించి చెప్పిన డైలాగు అది. రాజమౌళి మీద ఉన్న గౌరవతంతో హరీష్ శంకర్ కావాలని ఆ డైలాగు రాసాడని చెప్తున్నారు. ఇక రాజమౌళి ఇప్పటికే గబ్బర్ సింగ్ చిత్రం చూసి పవన్ కళ్యాణ్ కి ఎదురుచూస్తున్న హిట్ ఇచ్చారంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈగ వచ్చేనాటికి పవన్ గబ్బర్ సింగ్ కలెక్షన్స్ ఏ రేంజిలో ఉన్నా..రాజమౌళి చిత్రం కావటంతో ఈగ మార్కెట్ దానికి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...
చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.
'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.


Click it and Unblock the Notifications











