‘ఎన్ఆర్‌ఐ’లకోసం : దిల్ రాజు, హరీష్ శంకర్ ఆఫర్!

By Bojja Kumar

హైదరాబాద్: అమెరికా, కెనడా దేశాల్లో స్థిరపడి...తెలుగు సినిమాల్లో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలుగు వారికి శుభవార్త. మీలో టాలెంట్ ఉంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్లో త్వరలో రాబోయే సినిమాలో అవకాశం దక్కించుకోవచ్చు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కబోతోంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. యూఎస్ఏ, కెనడా దేశాల్లో స్థిరపడ్డ వారికి మాత్రమే ఈ అవకాశం. తమ సినిమాలో 18 నుండి 50 సంవత్సరాల వయసుగల వారిని వివిధ పాత్రలకు తీసుకోనున్నారు.

Harish Shankar-Dil Raju new film casting call

ఎంపికయిన వారు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే షూటింగు కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆసక్తిగల వారు [email protected] కు తమ వివరాలు, ఫోటోలు పంపొచ్చు. సినిమా షూటింగ్ అక్కడే జరుపనున్న నేపథ్యంలో అక్కడి వారిని తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ ‘కాస్టింగ్ కాల్' నిర్వహిస్తున్నారు.

రామయ్యా వస్తావయ్య సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తక్కవ బడ్జెట్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X