Ante Sundaraniki గెలుపు కాదు.. ధర్మమే శాశ్వతం.. అందుకే పవన్ కల్యాణ్‌కు మన గుండెల్లో స్థానం.. హరీష్ శంకర్ ఎమోష

నాని, నజ్రియా నజీం నటించిన అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అభిమానులకు చిన్న రిక్వెస్ట్. పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారు. సినిమా పరిశ్రమ ఒక్క కుటుంబానికి చెందినది కాదు.. సినిమా పరిశ్రమ అంటే ఒక ఫ్యామిలీ అని పలు సందర్భాల్లో చెబుతుంటారు. కాబట్టి మీరు సహకరిస్తే ఆయన సినిమా ఫంక్షన్లకు వస్తారు. సినిమా ఫంక్షన్లలో ఆర్టిస్టులను గౌరవించాలి. వాళ్లు మాట్లాడేటప్పుడు వినాలి. పవన్ కల్యాణ్ ఫంక్షన్‌కు వస్తే.. సజావుగా సాగనివ్వాలి. అప్పుడే పవన్ కల్యాణ్ పలు ఫంక్షన్లకు వస్తాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ను బయట చూడగలుగుతాం. లేకపోతే యూట్యూబ్‌లోనే చూడాల్సి వస్తుంది అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
భగత్ సింగ్ మూవీపై క్లారిటీ

భగత్ సింగ్ మూవీపై క్లారిటీ


మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థలో పవన్ కల్యాణ్ హీరోగా నా దర్శకత్వంలో వస్తున్న భగత్ సింగ్ భవదీయుడు సినిమాపై అనేక రూమర్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమా వస్తుందా? రాదా? ఎప్పడొస్తుందనే ఊహాగానాలు మీడియాలో చాలా వస్తున్నాయి. అలాంటి వార్తలకు ఒకే ఒక సమాధానం.. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా.. మీరు మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. పది కాలాలపాటు డైలాగ్స్ మాట్లాడుకొనేలా ఉంటుంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకొనే సమయం కాదు అని అన్నారు.

 వివేక్ ఆత్రేయ గురించి

వివేక్ ఆత్రేయ గురించి


ఇక అంటే సుందరానికి సినిమా నేను చూశాను. ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంది. సహాజసిద్దమైన నటనతో అందరూ నటించారు. వివేక్ ఆత్రేయ స్పెషాలిటీ ఏమిటి అంటే.. లాంగ్వేజ్ మీద ఆయనకు ఉన్న పట్టే ఆయన బలం. నాని, నరేష్ మధ్య ఉండే సీన్లు.. నాకు నాతండ్రికి మధ్య జరిగిన గొడవలు, భావోద్వేగమైన సన్నివేశాలు గుర్తుకొచ్చారు.

నలిగిపోయే పాత్రలో నాని, నజ్రియా

నలిగిపోయే పాత్రలో నాని, నజ్రియా


ఇక అంటే సుందరానికి సినిమా గురించి చెప్పాలంటే.. నలిగిపోయే పాత్రలో నాని, నాజ్రియా.. నలిపేసే పాత్రలో నదియా, నరేష్ అని హరీష్ శంకర్ సింగిల్ లైన్ పంచ్ ఇచ్చాడు. ఇక బామ్మ పాత్రలో నటించిన బిక్షు మాస్టర్ భార్య గురించి చెబుతూ.. మీరు మీ పేరు చెప్పకండి.. బామ్మగానే చెప్పుకోండి. అందరూ ఆ బామ్మను సినిమాలో పెట్టుకొందామని అనుకోవాలి అని హరీష్ శంకర్ తెలిపారు. హాస్పిటల్‌కు వెళ్లి వద్దాం అనే సీన్‌లో నదియా ఓ తల్లి పడే వేదనను అద్బుతంగా చూపించారు.

నాజ్రియా నజీంకు ఫ్యాన్‌ను..

నాజ్రియా నజీంకు ఫ్యాన్‌ను..


నాజ్రియా నజీం ఫాహద్ గురించి.. చెప్పుకోవాలి. రాజా రాణి సినిమాకు ముందు నుంచే మీకు ఫ్యాన్‌ని. లీలా పాత్లో అద్బుతంగా నటించారు. ఈ సినిమాలో ఎక్కడా కూడా నజ్రియా కనిపించలేదు. లీలా మాత్రమే కనిపించింది. తెలుగులో మీరు మళ్లీ నటించడం అభిమానులు హ్యాపీగా ఉంది అని హరీష్ శంకర్ అన్నారు.

పవన్ కల్యాణ్‌ ధర్మం కోసం..

పవన్ కల్యాణ్‌ ధర్మం కోసం..


మంచి సినిమాలు, మంచి టాలెంట్ ఎక్కడ ఉన్నా పవన్ కల్యాణ్ ఎంకరేజ్ చేస్తారు. నితిన్ సినిమా ఫంక్షన్‌‌కు వచ్చినా.. నాని సినిమా కోసం వచ్చినా సినిమాను ఆదరిస్తుంటాడు. గెలుపు కోసం పరిగెత్తే వాడు గెలిచిన తర్వాత అక్కడే ఆగిపోతాడు. ధర్మం కోసం నిలబడే వాడు.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అలాగే నిలబడుతాడు. గెలుపు శాశ్వతం కాదు.. ధర్మమే శాశ్వతం. ధర్మం కోసం నిలబడ్డాడు కాబట్టి మన గుండెల్లో ఆయన స్థానం శాశ్వతం అని హరీష్ శంకర్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X