twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది : హరీష్ శంకర్

    |

    కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి జారుకున్నారు బాలు... ఆయన పాటల పూదోటలో శ్రోతలను ఓలలాడించిన ఆ రారాజు గురించి ఎంత రాసుకున్నా తక్కువే. బాల సుబ్రమణ్యం మృతిని ఆయన అభిమానులు,సినిప్రముఖులు జీర్ణించుకోలేక పోతున్నారు. . 40 వేల పాటలను 16 భాషల్లో పాడిన గాన గంధర్వుడు లేడు అంటే పాటలే చిన్నబోతాయి. అలాంటి అభిమానులు కుప్పకూలడం అంటే అతిశయోక్తి కాదు. ఆయన లేరు అనే వార్త అబద్దం అయితే బాగుండు అంటూ ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలు గురించి జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరు పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

    Harish shankar expressed his displeasure over the national media

    బాలు మరణాన్ని అంతర్జాతీయ మీడియా కూడా ప్రసారం చేస్తుంటే మన జాతీయ మీడియా మాత్రం ఎక్కడ బాలు గురించి ప్రస్తావించడం లేదు. తాజాగా హరీష్ శంకర్ స్పందిస్తూ .. జాతీయ మీడియాను చూస్తుంటే జాలేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వరల్డ్ లో బాలు గారి పై కథనం వచ్చింది. కాని జాతీయ మీడియాలో మాత్రం రాలేదు అనే ఉద్దేశంతో... ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్బుతంగా ప్రజెంట్ చేసిందో... మన నేషనల్ మీడియాను చూస్తే జాలేస్తుంది. అంతేలే కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ఇరుకు సందుల్లో కాదు అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు .

    English summary
    Harish Shankar tweeted sharing the BBC News Coverage and said some people's legacy is global and not local. He took a serious jibe and fans of the director and legendary singer are appreciating it!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X