చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మల్టీ స్టారర్... హరీష్ శంకర్ రిక్వెస్ట్

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం అంటే చాలా మంది తెలుగు దర్శకులు ఒక మహాభాగ్యంలా భావిస్తారు. అలాంటి లెజెండ్‌తో సినిమా చేస్తే తమకూ మంచి గుర్తింపు వస్తుందని వారి ఆశ. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం కోసం కూడా చాలా మంది దర్శకులు ఎదురు చూస్తుంటారు. 'గబ్బర్ సింగ్' మూవీ ద్వారా పవర్ స్టార్‌తో చేసే అవకాశం ఇప్పటికే ఒకసారి దక్కించుకున్న హరీష్ శంకర్... మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ఈ మూగ్గురితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. ఈ ఛాన్స్ దక్కితే తన అంతకంటే గొప్ప విషయం ఏమీ ఉండదు అంటున్నారు. 'వాల్మీకి' ప్రమోషన్లో ఈ ప్రాజెక్టుపై హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హరీష్ శంకర్

హరీష్ శంకర్

తాజాగా ఓ తెలుగు వెబ్ సైట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్.... మిగతా మెగా హీరోలతో సినిమా ఎప్పుడు చేస్తారు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఇది మనం అనుకుంటే అవ్వదు. మెగా హీరోలు అనుకోవాలి. వారు ఓకే అంటే నేను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే' అన్నారు.

రామ్ చరణ్ మంచి టిప్ ఇచ్చాడు

రామ్ చరణ్ మంచి టిప్ ఇచ్చాడు

‘‘ధృవ మూవీ ప్రమోషన్ సమయంలో చరణ్ నాకు మంచి టిప్ ఇచ్చారు. నాతో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు? అని అడిగినపుడు.. ‘‘ నీ సినిమాలో హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఒక ఎమోషన్ యాడ్ చేస్తే మీరు రాజ్ కుమార్ హిరానీ తరహాలో సినిమాలు చేయగలరు'' అని రామ్ చరణ్ చెప్పినట్లు హరీష్ తెలిపారు.

చరణ్‌తో అలాంటి సినిమా చేస్తా

చరణ్‌తో అలాంటి సినిమా చేస్తా

చరణ్ నాకు ఆ సలహా చెప్పగానే నేను చాలా ఆలోచించా. ఒక హీరో మన గురించి ఇంత ఆలోచిస్తున్నపుడు మనం కూడా కొత్తగా చేస్తే బావుంటుంది అని డిసైడ్ అయ్యాను, ఇప్పటి వరకు చేయని జోనర్లో ప్రాపర్ ఎమోషన్‌తో ఒక మంచి వినోదం మిక్స్ చేసి చరణ్‌తో సినిమా చేయాలి.... అని హరీష్ వ్యాఖ్యానించారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మల్టీ స్టారర్...

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మల్టీ స్టారర్...

నాకంటూ అవకాశం వస్తే.... మెగాస్టార్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురూ కలిసి చేసే కథ ఉంది. దయచేసి ఈ వార్త మీడియా ద్వారా వారికి రీచ్ అయ్యి, నాకు కథ వినిపించే అవకాశం రావాలని అనుకుంటున్నాను.... అని హరీష్ వ్యాఖ్యానించారు.

మెగా అభిమానిగా ముందు ఆ సినిమా చూస్తా

మెగా అభిమానిగా ముందు ఆ సినిమా చూస్తా

నేను డైరెక్ట్ చేసిన సినిమా, మెగాస్టార్ సినిమా ఒకే రోజు విడుదలైతే... ఒక మెగా అభిమానిగా నేను సైరా సినిమాకే వెళతాను. నా సినిమా ప్రమోషన్లో పడి నాలోని ఎగ్జైట్మెంట్ చెప్పడం లేదు కానీ... సైరా ట్రైలర్ చూసినప్పటి నుంచి, గుర్రం మీద బాస్ ఇద్దరినీ వేసే షాట్ చూసి నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సైరా చూడాలని వెయిట్ చేస్తున్నాను.... అన్నారు.

వరుణ్ తేజ్ రియాక్ట్ అవుతూ

వరుణ్ తేజ్ రియాక్ట్ అవుతూ

చిరంజీవిగారి సినిమా అంటే మాకు ఒక పండగ, సైరా లాంటి చిత్రం, మన ఫ్రీడం ఫైటర్ గురించి, మన హిస్టరీ గురించి చెప్పుకునే సినిమా ఇప్పటి వరకు ఆయన చేయలేదు. ఆపద్భాందవుడు, అభిలాష, ఖైదీ, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా చాలా జోనర్లు చేశారు. కానీ ఇలాంటి జోనర్ చేయలేదు. చిరంజీవిగారు కత్తి పట్టుకుని లాంగ్ హెయిర్‌తో గుర్రం మీద వస్తుంటే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు... వరుణ్ తేజ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X