twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరికీ డప్పు కొట్టడమేనా అంటూ నెటిజన్ కామెంట్.. కూల్‌గా డైరెక్టర్ పంచ్

    |

    హరీష్ శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గబ్బర్ సింగ్ లాంటి ఆల్ టైమ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్.. పంచ్ డైలాగ్‌లకు చాలా ఫేమస్. అయితే హరీష్ కేవలం వెండితెరపై నవ్వులు పూయించడమే కాదు.. సోషల్ మీడియాలో అదిరిపోయే టైమింగ్‌తో పంచ్‌లు వేస్తుంటాడు. నెటిజన్స్ వేసే కామెంట్స్‌కు అదే స్టైల్లో రిప్లై ఇస్తూ ఉంటాడు. తాజాగా హరీష్ చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ వేసి కామెంట్, ఆయన ఇచ్చిన రిప్లై రెండూ వైరల్ అవుతున్నాయి.

    కరోనా క్రైసిస్ ఛారిటీ..

    కరోనా క్రైసిస్ ఛారిటీ..

    లాక్ డౌన్ వల్ల నష్టపోతోన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి, ముందుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరు పిలుపు మేరకు సినీ తారలంతా కదిలి వచ్చారు. ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు.

    ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్..

    ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్..

    చిరు ఇచ్చిన పిలుపు మేరకు సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, రవితేజ ఇరవై లక్షలు విరాళాన్ని ప్రకటించారు. వీరిని అభినందిస్తూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ఇలా సాయి ధరమ్ తేజ్‌ను మెచ్చుకుంటూ చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ నెగెటివ్ కామెంట్ చేశాడు.

    అందరికీ డప్పు కొట్టడమేనా..?

    అందరికీ డప్పు కొట్టడమేనా..?

    సాయి ధరమ్ తేజ్‌ను హరీష్ శంకర్ అభినందించిన ట్వీట్‌కు ఓ నెటిజన్ వెరైటీగా స్పందించాడు. అందరికీ డప్పు కొట్టడమేనా.. మీరు కూడా ఏదైనా ఇచ్చేది ఉందా హరీష్ గారూ అంటూ సెటైర్ వేసింది.

    Recommended Video

    Jr NTR's Kid Bhargava Ram Grabing Attention In Social Media
    కూల్‌గా రిప్లై..

    కూల్‌గా రిప్లై..

    అయితే సదరు నెటిజన్‌కు మాత్రం హరీష్ శంకర్ కూల్‌గానే రిప్లై ఇచ్చాడు. మీరు మంచి భాషలో అడిగి ఉంటే నేను కచ్చితంగా జవాబు ఇచ్చేవాడిని అంటూ కౌంటర్ వేశాడు. ఇదిలా ఉంటే కరోనా క్రైసిస్ ఛారిటీకి మాత్రం విరాళాలు పోటెత్తుతున్నాయి.

    English summary
    Harish Shankar Gets Negative Comments On Social Media. Even though Harish Shankar Gives Cool reply To Netizen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X