twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్, పూజా హెగ్డేపై రూమర్స్.. హరీష్ శంకర్ ఏమన్నాడో తెలుసా!

    |

    Recommended Video

    Harish Shankar Gives Clarity On Pawan Kalyan Movie || Filmibeat Telugu

    మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే లాంటి విజయవంతమైన చిత్రాలు ఈ దర్శకుడి ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో వాల్మీకి చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉండనుంది. కొన్ని రోజులుగా మీడియాలో వాల్మీకి చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందని, భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ క్రేజీ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ గురించి కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

    15 రోజుల కోసం

    15 రోజుల కోసం

    ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం పూజా హెగ్డే వాల్మీకి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. కేవలం 15 రోజులకే పూజా హెగ్డే 2 కోట్ల కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి దీనితో సినిమా అభిమానులంతా ఆశ్చర్యపోయారు. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కేవలం 15 రోజులకు 2 కోట్లు అంటే మామూలు విషయం కాదు.

    పవన్ కళ్యాణ్‌తో మీటింగ్

    పవన్ కళ్యాణ్‌తో మీటింగ్

    ఇక హరీష్ శంకర్ కేంద్రంగా మరో రూమర్ కూడా వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిశారని, వీరిద్దరి మధ్య సినిమా ప్రతిపాదనకు సంబంధించిన చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో రెండో చిత్రం రాబోతోందంటూ వార్తలు అల్లేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వదలిపెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయినా ఇలాంటి రూమర్స్ పుట్టుకుని వస్తూనే ఉన్నాయి.

    నా బాధ్యత

    నా బాధ్యత

    తనకు సంబంధించిన రెండు వార్తలు వైరల్ అవుతుండడంతో స్పందించాల్సిన భాద్యత తనని అని హరీష్ ట్విట్ చేశారు. పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పాడు.కానీ పూజ హెగ్డే ఈ చిత్రంలో నటించడం లేదు అని మాత్రం చెప్పలేదు. సినీ అభిమానులందరికి రిక్వస్ట్ చేస్తున్నా.. నా నుంచి కానీ, ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడండి అని హరీష్ క్లారిటీ ఇచ్చాడు.

    చాలా ఇష్టం

    ఇక పవన్ కళ్యాణ్ ని కలసినట్లు వస్తున్న వార్తలపై కూడా హరీష్ స్పందించాడు. పవర్ స్టార్ తో పనిచేయడం నాకు చాలా ఇష్టం. కానీ రీసెంట్ గా ఆయన్ని సినిమా కోసం కలసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని హరీష్ తేల్చేశాడు. దీనితో తో వాల్మీకి చిత్రం గురించి, పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న రూమర్లకు తెరపడ్డట్లు అయింది. వాల్మీకి చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

    English summary
    Harish Shankar gives clarity on Pooja Hegde remuneration news. He also responds on fake news about Pawan Kalyan movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X