మెగా అల్లుడితో సినిమా.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్!
Recommended Video

గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తదుపరి చిత్రం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. హరీష్ శంకర్ చివరగా తెరకెక్కించిన డీజే చిత్రం కమర్షియల్ గ విజయం సాధించింది. కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించడంలో హరీష్ శంకర్ ప్రతిభావంతుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే వంటి హిట్స్ హరీష్ ఖాతాలో ఉన్నాయి. తన గురించి వస్తున్న రూమర్స్ పై తాజాగా హరీష్ స్పందించాడు.

మెగా అల్లుడితో సినిమా
విజేత చిత్రంతో ఇటీవలే మెప్పించిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తదుపరి చిత్రం విషయంలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఊహాగానాలు హరీష్ శంకర్ తో ముడిపడి ఉండడం విశేషం. హరీష్ శంకర్ త్వరలో కళ్యాణ్ దేవ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

హరీష్ క్లారిటీ
ఈ వార్తలపై హరీష్ శంకర్ స్పందించాడు. కళ్యాణ్ దేవ్ ని డైరెక్ట్ చేయబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తన తదుపరి చిత్రం గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని హరీష్ పేర్కొన్నాడు.

కొన్నిసార్లు తప్పవు
ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన తదుపరి చిత్రాల జాబితాని ప్రకటించారు. అందులో తన చిత్రం లేదని నిట్టూరుస్తూ కొన్నిసార్లు ఇలాంటివి తప్పవు అని ట్వీట్ చేశాడు.

దాగుడు మూతలు
దాగుడు మూతలు టైటిల్ తో హరీష్ శంకర్ ఓ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేశాడు. ఆ చిత్రం దిల్ రాజు నిర్మణంలోనే రావలసి ఉంది. కానీ అనుకోని కారణాల వలన ఆ చిత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతిహో హరీష్ తదుపరి చిత్రం ఏంటనే విషయం ఉత్కంఠ పెంచుతోంది.


Click it and Unblock the Notifications











