హరీష్ శంకర్ డైరెక్షన్లో అల్లు అర్జున్.. సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్!
దర్శకుడు హరీష్ శంకర్, అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. అదేమిటి ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాను ప్రకటించారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ డైరెక్ట్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా? అవును నిజమే హరీష్ శంకర్ నిజంగానే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమిటా పరిస్థితి? ఎందుకు ఇప్పుడు అల్లు అర్జున్ ను ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. అనే వివరాల్లోకి వెళితే

భవదీయుడు భగత్ సింగ్
చివరిగా గద్దల కొండ గణేష్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తానని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శృతిహాసన్ హీరోయిన్గా పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది అని గతంలోని ప్రకటించారు. కానీ ఆ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన విషయాల మీద ఎవరికి క్లారిటీ లేదు.

అల్లు అర్జున్ ను
కనీసం ఈ విషయం మీద హరీష్ శంకర్ కైనా క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో గత రెండు మూడు రోజులు వ్యవధిలోనే ఆయన హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో కలిసి వెళ్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయి స్టోరీ వినిపించారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపద్యంలోనే హరీష్ శంకర్ ఇప్పుడు అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నారు.

యాడ్ ఫిలిం
అయితే అది సినిమా కాదు కేవలం ఒక యాడ్ ఫిలిం మాత్రమే మన దర్శకులు ఒకపక్క సినిమాల డైరెక్షన్ చేస్తూనే మరోపక్క యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది క్రిష్ త్రివిక్రమ్ లాంటి దర్శకులు కూడా ఇలా యాడ్ ఫిలిమ్స్ చేయడంలో అనుభవం సంపాదించారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే విధంగా ఒక యాడ్ ఫిలిం చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

బ్యాంకాక్
అల్లు అర్జున్ గారితో బయటకు వెళ్లడం ఎప్పుడూ ఒక ఫన్ రైడ్ లాగానే ఉంటుంది. ఇద్దరం కలిసి ఒక యాడ్ షూట్ చేయబోతున్న చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటూ హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. టాంజానియా దేశానికి వెకేషన్ కోసం వెళ్ళిన అల్లు అర్జున్ అట్నుంచి హైదరాబాద్ వచ్చారు.హైదరాబాద్ నుంచి వారు బ్యాంకాక్ ఒక యాడ్ షూట్ కోసం వెళ్లబోతున్నట్లు సమాచారం.

కోలా కంపెనీకి
కోలా కంపెనీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం ఉందని దానికి సంబంధించిన యాడ్ షూటింగ్ జరగబోతుందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ మేరకు వార్తలు వచ్చాయి. అయితే ఇది ఆ యాడ్ షూటింగ్ కోసమేనా లేక మరేదైనా యాడ్ షూటింగ్ కోసమా అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











