For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ మూవీ టైటిల్ ప్రకటన ఎప్పుడంటే..?

    By Bojja Kumar
    |
    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదనే సంగతి తెలిసిందే. ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే పలు టైటిళ్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఏదో ఒక టైటిల్ ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏ టైటిల్ ఖరారు చేస్తారో...

    ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపిస్తున్న ఓ పుకారు ఏమిటంటే...ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి అతిథి పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంతో తేలాల్సి ఉంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఉండనుంది. దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    Read more about: jr ntr
    English summary
    
 Young Tiger Jr NTR's forthcoming movie's shoot is progressing at a brisk pace in different locations of Hyderabad now. Grapevine is that the title of the movie will be announced officially on 20th April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X