'భవదీయుడు భగత్ సింగ్' నుంచి డైలాగ్ లీక్ చేసిన హరీశ్ శంకర్.. మెగా లీక్స్ అంటూ!

గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఆ స్థాయి మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా రాలేదు అని చెప్పాలి. ఆ తర్వాత కూడా కొన్ని మాస్ ఇమేజ్ తెచ్చుకున్న సినిమాలు చేశారు గానీ గబ్బర్ సింగ్ స్థాయి మాస్ మూవీ ఇప్పటివరకు మరోటి రాలేదు.. ఈ నేపథ్యంలో మరోసారి గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఆయన చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి దర్శకుడు హరీష్ శంకర్ లీక్ చేసిన డైలాగ్ ఇప్పుడు సినిమా మీద మరింత అంచనాలు పెంచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.

శరవేగంగా

శరవేగంగా


రాజకీయాల్లో వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన నటించిన భీమ్లా నాయక్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

మరి కొద్ది గంటల్లో

మరి కొద్ది గంటల్లో

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య విడుదలకు సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది సినిమా యూనిట్.

అనేక అంశాల మీద

అనేక అంశాల మీద

అందులో భాగంగానే అనేక మంది దర్శకులతో సినిమా ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేసిన వీడియో విడుదల చేశారు ఇక ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సినిమాకు సంబంధించిన అనేక అంశాల మీద ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ డైలాగ్ కూడా చెప్పుకొచ్చారు.

ఊర మాస్ డైలాగ్

ఊర మాస్ డైలాగ్

ఈ డైలాగ్ గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ హీరో గారు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల చాలామంది వస్తుంటారని ఈ సందర్భంగా ఈ డైలాగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. 'మొన్న వీడు మన ఇంటికొచ్చి, పెద్దగా అరిచినప్పుడు, అసలు ఎంట్రా వీడి ధైర్యం అని అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది. వీడు నడిస్తే వెనకాల లక్షమంది నడుస్తున్నారు. బహూశా ఇదే ఇతని ధైర్యమేమో. లేదు సార్.. ఆ లక్షలాది మందికే ఆయన ముందుండి నడుస్తున్నాడన్నదే ధైర్యం..' అనే ఒక ఊర మాస్ డైలాగ్ ని పవన్ కోసం హరీష్ శంకర్ సిద్ధం చేశాడట.

కళ్ళు కాయలు కాచేలా

కళ్ళు కాయలు కాచేలా

ఇదే డైలాగ్ ను చిరు కూడా తన నోటి వెంట పలికించి ఆనందింపచేశారు. ఇక ఈ ఒక్క డైలాగ్ తోనే ఈ సినిమా గబ్బర్ సింగ్ ను మించిన మాస్ ఫీస్టులా ఉండబోతోందని హింట్ ఇచ్చినట్లయింది. ఇక భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X