శ్రీనివాస కళ్యాణం టీజర్ మైండ్ బ్లోయింగ్.. లీక్ చేసిన హరీష్ శంకర్!

యంగ్ హీరో నితిన్, అందాల తార రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. దాదాపు 15 ఏళ్ల తరువాత దిల్ రాజు, నితిన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. వివాహ ప్రాముఖ్యతని తెలియజేసే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస కళ్యాణం చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్, కాన్సెప్ట్ టీజర్ మాత్రమే విడుదల చేశారు. మూవీ టీజర్ గురించి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన విషయం ఉత్కంఠ పెంచే విధంగా ఉంది. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మైండ్ బ్లోయింగ్ అంట

మైండ్ బ్లోయింగ్ అంట

శ్రీనివాస కళ్యాణం చిత్రం గురించి హరీష్ శంకర్ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. కొద్దీ సేపటి క్రితమే తాను దిల్ రాజుతో కలసి టీజర్ చూశానని హరీష్ తెలిపాడు. నితిన్, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్ అని తెలిపాడు.

అసలు సర్ప్రైజ్ అదే

ఈ చిత్రంలో ప్రేమ కథ అసలు సర్ప్రైజ్ అంటూ ఆసక్తికర విషయాన్ని హరీష్ శంకర్ లీక్ చేశారు. చిత్రం అద్భుతంగా ఉండబోతోందని కితాబిచ్చాడు. రేవు జరగబోయే ఆడియో వేడుకలో టీజర్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

థాంక్స్ డార్లింగ్

హరీష్ ట్వీట్ కు నితిన్ స్పందిస్తూ థాంక్స్ డార్లింగ్ అని బదులిచ్చాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు రేపు విడుదల కాబోతున్నాయి.

 నితిన్ తో సినిమా

నితిన్ తో సినిమా

వాస్తవానికి నితిన్ త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన దాగుడు మూతలు చిత్రానికి బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ నితిన్ తో మరో చిత్రం చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X