twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పకుండా జరుగుతుంది: పవన్ కళ్యాణ్‌తో సినిమాపై హరీష్ శంకర్ హాట్ కామెంట్

    |

    పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారా? అభిమానులకు అలరిస్తారా? లేక పూర్తిగా రాజకీయాలకే పరిమితమై ప్రజా సేవలోనే మునిగిపోతారా? అనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. జనసేన పార్టీ శ్రేణులు అలా జరుగకపోవచ్చు అని అంటుంటే... సినిమా రంగానికి చెందిన వారు మాత్రం త్వరలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తారు అనే ఆశతో ఉన్నారు.

    'వాల్మీకి' మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న ఎదురవ్వగా ఆసక్తికరంగా స్పందించారు. గతంలో ఈ దర్శకుడు పవర్ స్టార్‌కు 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సంగతి తెలిసిందే.

    మీరు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారట నిజమేనా?

    మీరు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారట నిజమేనా?

    మీరు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారట నిజమేనా? ... అనే ప్రశ్నకు హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ... ‘‘ఫ్యాన్స్‌తో పాటు మీరు కూడా సినిమా త్వరగా జరగాలని కోరుకోండి. తప్పకుండా జరుగుతుంది. నేను కూడా పవన్‌ కళ్యాణ్‌ గారితో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా అని వెయిటింగ్‌.'' అని వ్యాఖ్యానించారు.

    రీమేక్ చేస్తే తప్పేంటి?

    రీమేక్ చేస్తే తప్పేంటి?

    మీరు ఎక్కువగా రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నకు హరీష్ రియాక్ట్ అవుతూ... రీమేక్ చేస్తే తప్పేంటి? ఒక సినిమా ప్రేమికుడిగా నాకు నచ్చిన సినిమా రీమేక్ చేస్తాను అంటూ తేల్చేశారు. సినిమాకు ఒక పుస్తకం లేదా నవల, ఒక వ్యక్తి జీవితం స్పూర్తి అయినపుడు... ఒక సినిమా మరొక సినిమాకు స్పూర్తి అయితే తప్పేంటి? అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

    కథలో పెద్దగా మార్పలు చేయలేదు

    కథలో పెద్దగా మార్పలు చేయలేదు

    'దబాంగ్‌' చిత్రాన్ని తెలుగులో ‘గబ్బర్‌సింగ్‌' పేరుతో రీమేక్ చేసినపుడు చాలా మార్పులు చేశాం. కానీ 'జిగర్తాండ' చిత్రాన్ని ‘వాల్మీకి'గా మార్చినపుడు మార్పులు ఏమీ చేయలేదు. నాకు ఒరిజినల్ మూవీ స్క్రీన్ ప్లే బాగా నచ్చింది కాబట్టి పెద్దగా మార్పులు చేయకుండానే అలాగే తెలుగులో రీమేక్ చేశామని తెలిపారు.

    వాల్మీకి

    వాల్మీకి

    వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్మీకి'. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ హీరో అధర్వ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజ హెగ్డే ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్‌ 20న ఈ మూవీ విడుదల కాబోతోంది.

    English summary
    Director Harish Shankar made interesting comments about the film with Pawan Kalyan. "Along with the fans, you also want the film to be done quickly. Sure, I am waiting for Pawan Kalyan to do the film," he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X