హరీష్ శంకర్ ..లెజండ్ ని కలిసిన వేళ...(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : గబ్బర్ సింగ్ చిత్రం పవన్ తో చేసిన హరీష్ శంకర్ తాజాగా పవన్ తో అత్తారింటికి దారేది, జల్సా చిత్రాలు రూపొందించిన దర్శకుడు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలిసారు. త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న సెట్స్ మీదకు వెళ్లి మరీ కలిసారు. ఆ విషయాన్ని ఆయన ట్వీట్ చేసి, ఆ ఫొటోలు షేర్ చేసారు. ఆయన ట్వీట్ లో ...నేను లెజంజ్ ని కలిసాను..గొప్ప అనుభూతి...గ్రైట్ టైమ్ అని రాసుకొచ్చారు.

ఓ ఫ్లాప్‌, ఆ తరవాత ఓ హిట్‌.. ఇలా తన కెరీర్‌లో రెండూ అనుభవించేశారు హరీష్‌ శంకర్‌. 'షాక్‌' ఇచ్చి.. తరవాత 'మిరపకాయ్‌' తినిపించారు. 'గబ్బర్‌సింగ్‌'తో హరీష్‌ శంకర్‌ సత్తా పూర్తిస్థాయిలో బయటపడింది. పవన్‌ కల్యాణ్‌ని తెరపై చూపించిన తీరు, ఆయన చేత పలికించిన సంభాషణలూ... అభిమానులకు బాగా నచ్చేశాయి. అయితే 'రామయ్యా వస్తావయ్యా' కెరీర్‌లో పెద్ద కుదుపుగా మారింది. కొంతకాలం సినిమాల్లేకుండానే గడిపేశారు. స్టార్లతో సినిమా తీసిన హరీష్‌.. ఇప్పుడు మెగా మేనల్లుడుతో ఓ సినిమా చేస్తున్నారు. హరీష్‌ ఇప్పుడు కసితో ఉన్నారు. ఫ్లాప్‌ తరవాత హిట్‌ కొట్టి చూపించడం ఆయనకు అలవాటే. మరోసారి అదే మ్యాజిక్‌ చూపించడం కోసం ఆయన చమటోడుస్తున్నారు. పకడ్బందీగా కథ రాసుకొని ఆ తరవాతే... సెట్స్‌పైకి వెళ్లాలన్నది ఈ యువ దర్శకుడి ఆలోచన. అందుకోసం ఆయన స్క్రిప్టు మీద బాగా వర్కవుట్ చేసారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న చిత్రం వివరాల్లోకి వెళితే...

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందనున్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'. దిల్‌ రాజు నిర్మాత. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు.

దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘హరీశ్‌ శంకర్‌ చెప్పిన కథ నచ్చడంతో ‘పిల్లా నువ్వులేని జీవితం' విడుదలకు ముందే సాయిధరమ్‌తేజ్‌తో ఈ సినిమా ప్లాన్ చేసాం. మంచి లవ్‌స్టోరీ ఇది. కమర్షియల్‌ అంశాలతో పాటు కుటుంబ విలువలు కూడా మిళితమై ఉంటాయి. మార్చి వరకు హైదరాబాద్‌లో, ఏప్రిల్‌లో యు.ఎస్‌.లో షూటింగ్‌ చేస్తాం. ‘పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో నిర్మాతగా పరిచయమైన హర్షిత్‌ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్‌ చేస్తాడు. 2015లో మా సంస్థ నుంచి మూడు సినిమాలు విడుదలవుతాయి'' అని అన్నారు.

Harish Shankar met another Director Trivikram

హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘మిరపకాయ్‌ సమయంలోనే ఈ టైటిల్‌ని అనుకున్నా. కథను డెవలప్‌ చేస్తున్నప్పుడు ఫలానా హీరోకే అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ పూర్తయిన తర్వాత తేజుకి కరెక్ట్‌గా సరిపోతుందనిపించింది. తేజు మంచి స్టార్‌ అవుతాడు. ‘పవర్‌' చూసి రెజీనాను నాయికగా ఎంపిక చేసుకున్నాం. ఇందులో సీత అనే పవర్‌ఫుల్‌ రోల్‌లో చేస్తోంది. మిక్కీ మంచి సంగీతాన్నిస్తున్నారు. దిల్‌రాజు, శిరీశ్‌, లక్ష్మణ్‌ మోస్ట్‌ కంఫర్టబుల్‌ నిర్మాతలు.'' అని తెలిపారు.

హీరో మాట్లాడుతూ ‘‘రాజుగారి సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. హరీశ్‌తో ‘గబ్బర్‌సింగ్‌' టైమ్‌ నుంచి నాకు మంచి ర్యాపో ఉంది. రెజీనాతో రెండో సారి పనిచేయబోతున్నాను'' అని అన్నారు.

రెజీనా మాట్లాడుతూ ‘‘రొమాంటిక్‌ సినిమాలంటే నాకు ఇష్టం. సీత అనే పాత్రలో నటిస్తున్నాను'' అని తెలిపారు. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను కీలక పాత్రధారులు. ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే: రమేశ్‌ రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, ఆర్ట్‌: రామకృష్ణ, స్టంట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: మిక్కీ.జె.మేయర్‌, కెమెరా: రామ్‌ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌ ఎస్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X