‘సింహా’ నిర్మాతతో హరీష్ శంకర్ చిత్రం, మెగా హీరో!

By Bojja Kumar

హైదరాబాద్: మిరపకాయ్, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'సింహా' నిర్మాత పరుచూరి ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఈ చిత్రం గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...'మిరపకాయ్ చిత్రం జరుగుతున్నప్పట్నుంచి పరుచూరి ప్రసాద్ నా దర్శకత్వంలో ఓ మంచి సినిమా తీయాలని అనుకుంటున్నారు. ఇపుడు నేను డైరెక్ట్ చేసే కొత్త సినిమా పరుచూరి ప్రసాద్ గారి బ్యానర్లో చేస్తున్నాను. మెగా కాంపౌండ్‌లో ఓ యువ హీరోతో నిర్మించే ఈ చిత్రం మంచి ఎంటర్టెనర్‌గా రూపొందుతుంది' అన్నారు.

Harish Shankar new film with Paruchuri Prasad

అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సూపర్ సబ్జెక్టు ఈ చిత్రం కోసం రెడీ అయింది. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాన అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ బేనర్లో పరుచూరి కిరిటీ హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తారు.

హరీష్ శంకర్, పరుచూరి ప్రసాద్, పరుచూరి కిరిటీ కాంబినేషన్లో మెగా కాంపౌండ్‌లోని ఓ యువ హీరోతో తీసే ఈ సినిమాలో ఎన్నో విశేషాలుంటాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఆమె హీరో ఎవరు? అనే విషయం మాత్రం బయటకు చెప్పడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X