»   » అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్

అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరకెక్కబోతోంది. మాస్, క్లాసు ఆడియన్స్‌ను ఆకట్టుకునే హీరో అల్లు అర్జున్, మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో త్వరలో సినిమా తెరకెక్కబోతోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ అల్లు అర్జున్‌కు స్టోరీలైన్ వినిపించాడని, విన్న తర్వాత కాన్సెప్టు బాగుందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. దీంతో పాటు అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరో వైపు హరీష్ శంకర్ ప్రస్తుతం 'రామయ్యా వస్తావయ్యా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో సమంత, శృతి హాసన్ హీరోయిన్లు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత బన్నీతో చేయబోయే చిత్రంపై దృష్టి పెట్టనున్నాడు హరీష్ శంకర్.

English summary
After ‘Ramayya Vasthavayya’, Harish will move on to Stylish Star Allu Arjun’s film. This movie is reportedly a romantic entertainer with a good deal of action. The film is expected to be produced by Danayya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu