పవన్ కళ్యాణ్‌తో విభేదాలా? ఆయనో పర్వతం: మెగా హీరోలపై హరీశ్ శంకర్ చెప్పిన ఆసక్తికర విషయాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే, గబ్బర్ సింగ్ 2 కూడా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తారని అంతా అనుకుంటే అలా జరగలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ ఈ విషయంపై తాజాగా స్పందించారు.

అది రూమర్ మాత్రమే..

అది రూమర్ మాత్రమే..

పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ తర్వాత మరో సినిమా తీయాలనుకున్నా.. కానీ గబ్బర్ సింగ్ 2 తీయాలని అనుకోలేదని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో నాకు విభేదాలు వచ్చాయని అందుకే గబ్బర్ సింగ్ 2 తీయలేదనేది రూమర్ మాత్రమేనని స్పష్టం చేశారు. పవన్ లాంటి స్టార్ హీరోను డీల్ చేస్తున్నప్పుడు కాస్త సస్పెన్స్ ఉండాలన్నారు.

పవన్ కళ్యాణ్ ఓ పర్వతం..

పవన్ కళ్యాణ్ ఓ పర్వతం..

పవన్ కళ్యాణ్ ఒక పర్వతం అయితే.. తాను ఒక గులకరాయి లాంటి వాడినని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ఆయనతో తనకు ఎలా విభేదాలు వస్తాయని అన్నారు. తనకు తన స్థాయి వాళ్లకు విభేదాలు అంటే ఒప్పుకోవచ్చుగానీ.. పవన్‌తో విభేదించే స్థాయి తనది కాదని వ్యాఖ్యానించారు.

పవన్ కోసం పదేళ్లైనా వెయిట్ చేస్తా..

పవన్ కోసం పదేళ్లైనా వెయిట్ చేస్తా..

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్‌తో మళ్లీ ఓ సినిమా చేయాలని అనుకున్నాను. ఈ విషయంపై తాను పవన్ ను కలిశాను. తన సంతోషాన్ని, తన విజయాన్ని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తో సినిమా వద్దనే దర్శకుడు ఉన్నారా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌పతో సినిమా చేయడానికి తన దగ్గర రెండు మూడు లైన్స్ ఉన్నాయని.. పవన్ ఒప్పుకుంటే స్క్రిప్టు దానికదే వస్తుందని హరీశ్ అన్నారు. పవన్ ఓకే చెబితే ఆయనతో సినిమా తీసేందుకు 10-15ఏళ్లు నిరీక్షించేందుకు కూడా తాను సిద్ధమని అన్నారు.

అదే బాధ కలిగించే విషయం కానీ..

అదే బాధ కలిగించే విషయం కానీ..

రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే బాధేస్తోందని హరీశ్ శంకర్ అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని.. గెలుపు ఓటములకు భయపడే వ్యక్తి కాదని అన్నారు. పవన్ పొలిటికల్ జీవితం గురించి సినిమా తీయను కానీ.. ప్రజల కోసం ఆయన పడే తపనను మాత్రం తెరపై చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు.

చిరుతో సినిమా చేయాలని..

చిరుతో సినిమా చేయాలని..

పవన్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేశాను.. రామ్ చరణ్‌తో ఎప్పుడైనా సినిమా చేయవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న మంచి కథను రామ్ చరణ్‌కు త్వరలోనే వినిపస్తానని చెప్పుకొచ్చారు. అయితే, మెగాస్టార్ చిరంజీవితోనే తనకు సినిమా చేయాలని ఉందని హరీశ్ శంకర్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X