twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి మనసును చాటుకున్న డైరెక్టర్.. పుట్టినరోజున అలా ప్లాన్ చేశాడా?.. నెటిజన్ల ప్రశంసలు

    |

    డైరెక్టర్ హరీష్ శంకర్ తన మంచి మనసును చాటుకున్నాడు. తన పుట్టిన రోజున అనాథ పిల్లలకు అండగా నిలిచాడు. వారి కోసం ఆర్థిక సాయాన్ని చేశాడు. రెండు నెలల పాటు సరిపోయే పౌష్టికాహారాన్ని అందజేశాడు. ఈ మేరకు హరీష్ శంకర్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు ఒక రోజు ముందే ఇదే విషయమై హరీష్ శంకర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

    అందరికీ డప్పు కొట్టడమేనా..?

    అందరికీ డప్పు కొట్టడమేనా..?

    కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ శ్రామికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీకి విరాళాలు ఇచ్చిన సాయి ధరమ్ తేజ్‌ను హరీష్ శంకర్ అభినందించిన ట్వీట్‌కు ఓ నెటిజన్ వెరైటీగా స్పందించాడు. అందరికీ డప్పు కొట్టడమేనా.. మీరు కూడా ఏదైనా ఇచ్చేది ఉందా హరీష్ గారూ అంటూ సెటైర్ వేశారు.

    కూల్‌గా రిప్లై..

    కూల్‌గా రిప్లై..

    అయితే సదరు నెటిజన్‌కు మాత్రం హరీష్ శంకర్ కూల్‌గానే రిప్లై ఇచ్చాడు. మీరు మంచి భాషలో అడిగి ఉంటే నేను కచ్చితంగా జవాబు ఇచ్చేవాడిని అంటూ కౌంటర్ వేశాడు. అయితే హరీష్ దానగుణం ఏంటో ఈ రోజు అందరికీ తెలిసింది.

    నేడు హరీష్ పుట్టినరోజు..


    మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ పుట్టినరోజు నేడు. ఈ మేరకు హరీష్ శంకర్‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ చేసిన సాయం బయటకు వచ్చింది. ఓ ఆశ్రమంలో ఉంటున్న దాదాపు 50 మంది పిల్లలకు రెండు నెలలకు సరిపోయే పౌష్టికాహారాన్ని అందించినట్టు సదరు సంస్థ వెల్లడించింది.

    పిల్లలంతా విషెస్ చెప్పారు..

    పిల్లలంతా విషెస్ చెప్పారు..

    హరీష్ శంకర్ చేసిన సాయానికి గానూ ఆ సంస్థ స్పందిస్తూ.. ఈ ఏడాది ఆయన పుట్టినరోజుకుగానూ రెండు నెలలకు సరిపోయే నిత్యావసరాలను అందించారు. స్వీట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్ వంటివి కూడా ఇచ్చారు. మా ఆశ్రమంలో దాదాపు 45 మంది పిల్లలున్నారు.. వారంతా హరీష్ శంకర్‌కు విషెస్ చెప్పాలనుకుంటున్నారని ట్వీట్ చేశారు. హరీష్ తాను చేసిన సాయాన్ని బహిరంగంగా చెప్పుకోకపోవడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

    English summary
    Harish Shankar This year on his birthday he has contributed groceries for 2 months , sweets,snacks , dry fruits ,cakes , to our Home which has almost 45 children .Children want to wish him a very happy birthday and we wish great health and success in all his future endeavors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X