twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీసీసీ’పై డైరెక్టర్ ప్రశంసలు.. హ్యాట్సాఫ్ అంటూ హరీష్ శంకర్ ట్వీట్

    |

    కరోనా వైరస్ మూలంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాను ముందుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి.. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించాడు. ఆర్థిక సాయం చేయాలని తోటీ నటీనటులకు చిరంజీవి పిలుపునిచ్చాడు. ఈ మేరకు లక్షల కొద్ది విరాళాలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోలు, యువ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా అందరూ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చాడు.

    దాదాపు 8 కోట్లకు పైగా విరాళాలు పోగు చేసిన సీసీసీ.. ఆపై సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం ప్రారంభించింది. సినీ కార్మికుల ఇంటికి స్వయంగా వెళ్లి లిస్ట్ ప్రకారం అందరికీ అన్ని సరుకులను అందజేస్తోంది సీసీసీ బృందం. ఈ మేరకు హరీష్ శంకర్ సీసీసీపై ప్రశంసలు కురిపించాడు. సామాజిక దూరం అనే నిబంధనను ఉల్లంఘించిన ఓ వీడియోను షేర్ చేస్తూ... సీసీసీని పొగిడాడు.

     Harish Shankar Praised CCC Team

    అమలాపురంలో నిత్యావసర సరుకుల కోసం జనం ఎగబడటం, సామాజిక దూరం పాటించకపోవడంతో హరీష్ శంకర్ సీసీసీ పనితనాన్ని మెచ్చుకున్నాడు. 'సామాజిక దూరాన్ని పాటిస్తూ.. చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ ఎంతో గొప్పగా పని చేస్తోంది.. మెహర్ రమేష్, ఎన్ శంకర్ టీమ్స్ ఎంతో బాగా బాద్యతను నిర్వర్తిస్తున్నాయి.. సీసీసీ బృందానికి హ్యాట్సాఫ్' అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Harish Shankar Praised CCC Team. This is where #CCC team differs from all... under the guidance of Megastar KChiruTweets Nshankar MeherRamesh and team are working day and night to avoid social gatherings while distributing groceries.... hats off to team #CCC
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X