తమన్ దరువుకు హరీష్ శంకర్ కూల్ అయ్యాడు

By Bojja Kumar

హైదరాబాద్ : దర్శకుడు హరీష్ శంకర్‌కు ఆనందం వచ్చినా, కోపం వచ్చినా...ఓ పట్టాన ఆపుకోలేడని స్పష్టం అయింది. ఆ మధ్య తమన్ ఆడియో ఔట్ పుట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ట్విట్టర్లో తన కోపాన్ని వెల్లగక్కిన హరీష్....తాజాగా తమన్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉండటంతో కూల్ అయ్యాడు.

తాజాగా హరీష్ శంకర్ తన ట్విట్టర్లో తమన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. తమన్ తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ రామయ్యా వస్తావయ్యా చిత్రానికి అందించారు. ఆయన ఇచ్చిన ట్యూన్స్ జూ ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్స్‌ను అందుకునే విధంగా అద్భుతంగా ఉన్నాయి. మీకు కూడా పాటలు నచ్చుతాయి. త్వరలోనే ఆడియో విడుదల తేదీ ప్రకటిస్తాము అని ట్వీట్ చేసాడు హరీష్.

తమన్ ఆడియో కంపోజింగ్ పూర్తి చేయడంతో అందులోని రెండు సాంగులను స్పెయిన్ దేశంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ రెండు సాంగులు ప్రేక్షకులకు నయనానందకరంగా అద్భుతమైన డాన్స్ స్పెప్పులతో పాటు, రొమాంటిక్‌గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. షూటింగ్ ఆగస్టు 26 నుండి స్పెయిన్లో జరిపేందుకు రంగం సిద్దమైంది.

సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27 విడుదల చేస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X