అదిరిపోయే టైటిల్ తో సస్పెన్స్ లోకి నెట్టిన హరీష్ శంకర్.. బన్నీ పాటతో..ఆ హీరో ఎవరు!
Recommended Video

గబ్బర్ సింగ్ చిత్రం తరువాత హరీష్ శంకర్ క్రేజే మారిపోయింది. హరీష్ ఇప్పుడు టాలీవుడ్ లో అందరు హీరోలకు కావలసిన దర్శకుడు. ట్రెండుకు తగ్గట్లుగా మాస్ ప్రేక్షకులని మెప్పించడంలో హరీష్ శంకర్ దిట్ట. డీజే చిత్రం తరువాత హరీష్ శంకర్ ఇద్దరు హీరోలతో మల్టి స్టారర్ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజగా హరీష్ శంకర్ ఓ ఆసక్తికరమైన కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్ మరియు ఇతర వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

డీజే తరువాత
హరీష్ శంకర్ చివరగా దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని రూపొందించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత హరీష్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.

దాగుడుమూతలు అంటూ
డీజే చిత్రం తరువాత హరీష్ ఓ మల్టి స్టారర్ చిత్రానికి కమిట్ అయ్యాడు. నితిన్, శర్వానంద్ హీరోలుగా ఈ చిత్రం రూపొందనునట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దాగుడుమూతలు అనే ఆసక్తికరమైన టైటిల్ ని పరిశీలిస్తున్నాడు.

అంతలోనే మరో కథ
దాగుడుమూతలు చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అంతలోనే హరీష్ మరో కథని సిద్ధం చేసుకుంటున్నాడట.

బన్నీ పాటతో
డీజే చిత్రంలో సీటిమార్ అనే సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలోని పదం 'సీటీ మార్' ని ఈ చిత్రానికి టైటిల్ గా అనుకుంటున్నట్లు సమాచారం.

ఎవరా యువ హీరో
సీటిమార్ అంటూ ఆసక్తికరమైన టైటిల్ ని పరిశీలిస్తున్న హరీష్ శంకర్ ఈ కథని ఎవరితో చేయబోతున్నాడో చెప్పకుండా సస్పెన్స్ లోకి నెట్టేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరోతో హరీష్ ఈ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











